పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్, వకీల్ సాబ్ షూటింగ్ స్టార్ట్

  • Published By: madhu ,Published On : November 6, 2020 / 05:03 PM IST
పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్, వకీల్ సాబ్ షూటింగ్ స్టార్ట్

Pawan Kalyan Jet Speed In Films : పాలిటిక్స్ కోసం సినిమాల నుంచి బ్రేక్ తర్వాత మళ్లీ రెండేళ్ల తర్వాత సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఈ సారి ఆడియన్స్ కి సరికొత్తగా కనిపించడానికి రెడీ అవుతున్నారు. 25వ సినిమా అగ్నాతవాసి తర్వాత ఇన్నాళ్లకు చేస్తున్న వకీల్ సాబ్ మూవీ లో సీరియస్ రెస్పాన్సిబుల్ లాయర్ రోల్ చేస్తున్నారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో సోషల్ ఇంట్రస్ట్ ఇష్యూ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరికొత్తగా కనిపిస్తున్నారు. మహిళకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి అందరితో ఫైట్ చేసే క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్.



లాక్ డౌన్ విధించడంతో మే లో రిలీజ్ అవ్వాల్సిన వకీల్ సాబ్ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. రిలీజ్ కాదు కదా…కనీసం షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు. షూటింగ్ కంప్లీట్ కాలేదు కానీ ..వరుస పెట్టి సినిమాల్ని మాత్రం సైన్ చేసేశారు జనసేనాని. అనుకున్నవి అనుకున్న టైమ్ లో కంప్లీట్ చెయ్యడానికి తన వైపు నుంచి ఏమాత్రం లేట్ చెయ్యకుండా వకీల్ సాబ్ షూటింగ్ స్పీడప్ చేసేశారు పవన్ కళ్యాణ్.



https://10tv.in/pawan-kalyan-travels-in-hyderabad-metro-rail/
ఈ సినిమా లొకేషన్ కి మెట్రోలో వెళ్లి సందడి చేశారు పవర్ స్టార్. మెట్రోలో నార్మల్ గా జర్నీ చేసిన పవన కళ్యాణ్.. జర్నీ గ్యాప్ లో ట్రెయిన్ లో ఉన్న వాళ్లతో మాట్లాడారు. అలా ఇటు సినిమా స్టార్ గా షూటింగ్ ని కంప్లీట్ చేస్తూ.. జనసేనాని గా సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఇలా స్వామి కార్యం, స్వకార్యం రెండూ కంప్లీట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్, హరీష్ శంకర్, సాగర్ చంద్ర, సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సినిమాలు చెయ్యడానికి ప్లాన్లు రెడీ చేసుకుంటున్నారు.