Pawan Kalyan: ఆ డైరెక్టర్‌తో సినిమాను పక్కనబెట్టిన పవన్..?

‘భీమ్లా నాయక్’ చిత్రంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏమిటో చూపించాడు. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

Pawan Kalyan: ‘భీమ్లా నాయక్’ చిత్రంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏమిటో చూపించాడు. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో రానా దగ్గుబాటి పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంతో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.

Pawan Kalyan: పాఠాలు చెబుతున్న భగత్‌సింగ్.. నిజమేనా?

కాగా ప్రస్తుతం పవన్ తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన లైన్‌లో పెట్టిన సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ జాబితాలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’, దర్శకుడు హరీష్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వంటి సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా పవన్ మరో రీమేక్ చిత్రంపై మనసుపడ్డాడని తెలుస్తోంది. తమిళంలో సముద్రఖని తెరకెక్కించిన ‘వినోధాయ సితం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు పవన్ ఆసక్తిగా ఉన్నాడట. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్టు పనులను త్రివిక్రమ్‌కు అప్పగించాడట.

Bheemla Nayak : ‘రాధేశ్యామ్’ రాకతో ‘భీమ్లా నాయక్’కి దెబ్బ.. నష్టాల్లో డిస్ట్రిబ్యూటర్స్..

అయితే ఈ రీమేక్ సినిమా కారణంగా దర్శకుడు హరీష్ శంకర్‌తో చేయబోయే సినిమా ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. కాగా వీటితో పాటు మరో స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో పవన్ ఓ సినిమా చేసేందుకు గతంలో అంగీకరించాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాను పవన్ పక్కనబెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి బలమైన కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పిన స్క్రిప్టు పవన్‌కు నచ్చలేదని.. అందుకే ఈ సినిమాకు నో చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రామ్ తాళ్లూరితో ఓ సినిమా ఖచ్చితంగా చేస్తానని మాటిచ్చిన పవన్, మరో మంచి కథను తీసుకొస్తే తాను చేసేందుకు రెడీ అంటూ చెప్పుకొచ్చాడట. దీంతో రామ్ తాళ్లూరి వేరొక డైరెక్టర్‌ను పట్టుకొచ్చే పనిలో బిజీగా ఉన్నట్లు చిత్రపురిలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి రామ్ తాళ్లూరి కోసం అదిరిపోయే కథను ఏ డైరెక్టర్ తీసుకొస్తాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు