Pawan Kalyan : సుమక్క సినిమా కోసం రంగంలోకి పవర్ స్టార్..

ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, రానా.. ఇలా స్టార్స్ అంతా సుమక్క కోసం వచ్చి సినిమాని సాంగ్, టీజర్ లాంచ్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా మే 6న రిలీజ్ కి ఉండటంతో ప్రమోషన్స్ జోరు...

Pawan Kalyan : సుమక్క సినిమా కోసం రంగంలోకి పవర్ స్టార్..

Suma

 

Anchor Suma :  బుల్లితెర రారాణిగా ఓ వెలుగు వెలుగుతుంది యాంకర్ సుమ క‌న‌కాల. పరిశ్రమకి వచ్చి చాలా సంవత్సరాలైనా ఇప్ప‌టికీ స్టార్ యాంక‌ర్‌గానే కొన‌సాగుతుంది. బుల్లితెరపై సుమకి తిరుగులేదు. ఇప్పుడొచ్చే యాంకర్స్ అంతా టీవీలోనే కాక సినిమాల్లోనూ కనపడటానికి ట్రై చేస్తున్నారు. సుమ ఎప్పుడూ సినిమాల్లో కనపడటానికి ట్రై చేయలేదు. అప్పుడప్పుడు ఎవరైనా చిన్న చిన్న పాత్రలు చేయమని రిక్వెస్ట్ చేస్తే కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. వర్షం, ఢీ, బాద్ షా, ఓ బేబీ చిత్రాలలో సుమ చిన్న చిన్న పాత్రలు చేశారు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయి పాత్రలో అది కూడా సుమ మెయిన్ లీడ్ లో ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా రాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. సుమ కోసం టాలీవుడ్ స్టార్స్ అంతా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, నాని, రానా.. ఇలా స్టార్స్ అంతా సుమక్క కోసం వచ్చి సినిమాని సాంగ్, టీజర్ లాంచ్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా మే 6న రిలీజ్ కి ఉండటంతో ప్రమోషన్స్ జోరు బాగా పెంచింది సుమ. ఇన్నాళ్లు తాను సాధించిన స్టార్ డం అంతా ఈ సినిమాకి ఉపయోగించి అన్ని రకాల ప్రమోషన్స్ చేస్తుంది. ప్రమోషన్స్ తో బిజీ బిజీగా ఉంది సుమ. తాజాగా సుమక్క కోసం ఏకంగా పవర్ స్టార్ రంగంలోకి దిగనున్నారు.

RGV : అసలే సౌత్ సక్సెస్‌పై కుళ్ళుకుంటున్న బాలీవుడ్.. ట్వీట్స్‌తో మరింత రెచ్చగొడుతున్న ఆర్జీవీ..

జయమ్మ పంచాయితీ ట్రైలర్ ని పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 16న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఇలా సుమ తన సినిమా ప్రమోషన్స్ కోసం పవన్ కళ్యాణ్ ని కూడా తీసుకొచ్చేస్తుంది. టాలీవుడ్ లో ఎవరి సినిమా ఫంక్షన్ అయినా, ఇంటర్వ్యూ అయినా సుమనే చేయాలి. ఇన్ని సంవత్సరాలుగా సుమ వారి సినిమా ఫంక్షన్స్ లో తన మాటలతో అలరించడంతో ఇప్పుడు వారంతా సుమకి సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు అనడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.