Sailesh Kolanu : మొన్న పవన్ అభిమానికి బిర్యానీ.. నేడు శైలేష్ కొలనుకు అభిమాని పవన్ బ్రేక్‌ఫాస్ట్..
అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తున్న టాలీవుడ్ మేకర్స్. మొన్న OG నిర్మాతలు పవన్ కళ్యాణ్ అభిమానికి బిర్యానీ పంపిస్తే, నేడు డైరెక్టర్ శైలేష్ కొలను ఏకంగా..

Pawan Kalyan OG makers and Sailesh Kolanu surprize their fans
Sailesh Kolanu : ఇటీవల కాలంలో టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్స్ సత్తా చాటుతున్నారు. అలా అభిమానుల చేత హిట్ డైరెక్టర్ అనిపించుకున్న దర్శకుడు శైలేష్ కొలను. నేచురల్ స్టార్ నిర్మాణంలో విశ్వక్ సేన్ తో హిట్ ది ఫస్ట్ కేసు సినిమాని తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు. తాజా అడివిశేష్ తో హిట్ 2 ని తీసి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. హిట్ 3 ని నానితో తెరకెక్కించబోతున్నట్లు ఆల్రెడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ హిట్ క్రైమ్ సిరీస్ కి కొంచెం బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో (Daggubati Venkatesh) ‘సైంధవ్’ (Saindhav) అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
Saindhav: జాస్మిన్‌గా స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ఆండ్రియా.. సైంధవ్‌లో ఇంతమంది దేనికో..?
కాగా శైలేష్ నిన్న కాకినాడ నుంచి హైదరాబాద్ కి బైక్ మీద బయలుదేరాడు. ఆ విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ వేశాడు. ఇక ఆ పోస్ట్ చూసిన పవన్ అనే అభిమాని.. దారిలో తన ఇంటికి బ్రేక్ ఫాస్ట్ చేయడానికి శైలేష్ ని రమ్మని మెసేజ్ చేశాడు. అయితే శైలేష్ నిజంగానే పవన్ ఇంటికి బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వెళ్లి పవన్ ని సర్‌ప్రైజ్ చేశాడు. పవన్ వాళ్ళ అమ్మ శైలేష్ కి పునుగులు టిఫిన్ పెట్టారని, చాలా బాగున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. పవన్ అమ్మ వెంకటేష్ అభిమాని అంటా. సైంధవ్ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తానంటూ ఆమె చెప్పిందట. ఈ విషయాలను షేర్ చేస్తూ శైలేష్, పవన్ తో దిగిన ఫోటో షేర్ చేశాడు.
Pawan Kalyan OG : పవన్ అభిమానికి OG నిర్మాత డివివి బిర్యానీ పార్సిల్.. ఫోటో వైరల్!
అయితే ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని కూడా ఇలాగే సర్‌ప్రైజ్ చేశారు OG మూవీ నిర్మాతలు. రంజాన్ పండుగా రోజు పవన్ కళ్యాణ్ అభిమాని ట్విట్టర్ లో OG నిర్మాతలకు.. పండక్కి బిర్యానీ అప్డేట్ ఏమి లేదా? అంటూ ట్వీట్ చేశారు. దానికి రెస్పాండ్ అవుతూ.. అడ్రెస్ పెట్టు పంపిస్తాం అంటూ ట్వీట్ చేశారు. పవన్ అభిమాని అడ్రెస్ పెట్టగా.. తన రూమ్ కి అప్డేట్ కి బదులు బిర్యానీ పార్సిల్ పంపించి OG నిర్మాతలు సర్‌ప్రైజ్ చేశారు.
This is Pavan. He saw the post about my ride from Kakinada to Hyderabad and DMed me inviting us to come home for breakfast. Surprised him. Such a lovely family. Punugulu thinipincharu Pavan amma. So yummy. Was thrilled to know that amma is an ardent @VenkyMama fan 🙂 She said she… pic.twitter.com/3SHAMgGV33
— Sailesh Kolanu (@KolanuSailesh) May 4, 2023