Tollywood First Half : సూపర్ హిట్ కొట్టిన పవన్, రవితేజ..

అప్పుడే 6 నెలలైపోయింది.. టాలీవుడ్‌లో ఏం హడావిడి లేకుండానే హాఫ్ ఇయర్ అయిపోయింది..

Tollywood First Half : సూపర్ హిట్ కొట్టిన పవన్, రవితేజ..

Tollywood First Half

Tollywood First Half: అప్పుడే 6 నెలలైపోయింది. టాలీవుడ్‌లో ఏం హడావిడి లేకుండానే హాఫ్ ఇయర్ అయిపోయింది. ఎంట్రీతో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిన టాలీవుడ్ ముచ్చట మూడు నెలలకే పరిమితమైంది. ఇక తర్వాత మూడు నెలలు మాత్రం అస్సలు సౌండ్ లేకుండా కామ్ అయిపోయింది. అందుకే పోయిన 6 నెలల గురించి కాకుండా రాబోయే 6 నెలల మీదే ఆశలన్నీ పెట్టుకున్నారు ఆడియెన్స్. మరి ఈ 6 నెలల సినిమాల రిలీజ్ సంగతేంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

టాలీవుడ్ 2021 డైరీలో అపుడే 6 నెలలు అయిపోయాయి. మొదటి ఆరు నెలలూ కరోనా కాలంలో కలిసి పోయింది కాబట్టి.. వచ్చే 6 నెలల మీదే ఆశలు పెట్టుకుంటున్నారు అభిమానులు. నిజానికి 2021 సంవత్సరంలోకి కొత్త కొత్త ఎక్స్‌పెక్టేషన్స్‌తో అడుగుపెట్టిన టాలీవుడ్‌‌‌కి అస్సలు కలిసి రాలేదు ఫస్ట్ హాఫ్. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి అప్పుడే కోలుకుంటున్న టాలీవుడ్‌‌కి సంక్రాంతికి రిలీజ్ అయిన రవితేజ ‘క్రాక్’ సినిమా మంచి బోణీ కొట్టింది.
వాయిస్
ఫిబ్రవరిలో ‘జాంబీ రెడ్డి’ లాంటి డిఫరెంట్ మూవీస్ రిలీజ్ అయ్యి కాస్త రిలాక్సేషన్ ఇచ్చాయి. అయితే ‘ఉప్పెన’ మాత్రం 100 కోట్ల కలెక్షన్లతో టాలీవుడ్‌లో కొత్త ఆశలు కల్పించింది. ఇక మార్చిలో ‘శ్రీకారం’, ‘గాలిసంపత్’, ‘అరణ్య’, ‘రంగ్ దే’, ‘ఎ 1 ఎక్స్‌ప్రెస్’ లాంటి సినిమాలు అంతగా ఆడకపోయినా ‘జాతిరత్నాలు’ హిలేరియస్ హిట్‌గా నిలిచింది.
ఏప్రిల్‌లో ‘వైల్డ్ డాగ్’ తో నాగార్జున డిజప్పాయింట్ చేసినా పవర్ స్టార్ మాత్రం ‘వకీల్ సాబ్’ తో సూపర్ హిట్ ఇచ్చారు. కానీ ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా ఆడకుండానే కరోనా ఎఫెక్ట్‌తో థియేటర్లు మూత పడిపోయాయి.

ఫస్ట్ హాఫ్.. సరిగా సినిమాలు రిలీజ్ కాకుండానే ముగిసిపోయింది. అందుకే ఎన్నో ఆశలతో మిగిలిన ఆరు నెలలకోసం ఎదురుచూస్తున్నారు మేకర్స్. మేకర్స్‌తో పాటు ఆడియెన్స్ కూడా. ఇప్పటికే లాక్‌డౌన్ తీసెయ్యడంతో త్వరలోనే థియేటర్లు కూడా ఓపెన్ చేస్తారన్న ఆశతో రిలీజ్ కోసం సినిమాల్ని రెడీ చేస్తున్నారు మేకర్స్. వీటిలో లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ‘లవ్ స్టోరీ’, ‘విరాటపర్వం’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలు ముందు రిలీజ్ కాబోతున్నాయి.

జూలైలో థియేటర్లు తెరుచుకున్నా.. ఆగస్ట్ నాటికి పెద్ద సినిమాలు లైనప్ రెడీ అవుతుంది. ఆల్రెడీ ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’ సినిమాలు లైన్‌లోనే ఉన్నాయి. ఆగస్ట్‌లో వెంకటేష్, వరుణ్ మల్టీస్టారర్‌గా వస్తున్న ‘ఎఫ్ 3’ కి సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప’ సినిమా కూడా ఆగస్ట్ 13 న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.

సెప్టెంబర్‌లో చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా కూడా త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో చేస్తున్న ‘అఖండ’ సినిమా కూడా లాస్ట్ స్టేజ్‌కి రావడంతో సెప్టెంబర్‌లోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక రవితేజ ‘ఖిలాడి’ కూడా షూటింగ్ ఫినిష్ చేసుకుని ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వద్దామా అని వెయిట్ చేస్తున్నారు. మోస్ట్‌లీ ప్రభాస్ మూడేళ్ల నుంచి చేస్తున్న ‘రాధే శ్యామ్’ సినిమా కూడా ఈ నెలలోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్.

అక్టోబర్‌లో అయితే ఫ్యాన్స్‌కి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. టాలీవుడ్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ ట్రిపుల్ ఆర్ అనుకున్న టైమ్‌కే వస్తానని లేటెస్ట్‌గా అనౌన్స్ చేశారు. అక్టోబర్ 13న దసరా సీజన్‌లో రిలీజ్ అవ్వడానికి ఈ పాన్ ఇండియా మూవీ రెడీ అవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

నవంబర్‌లో దీపావళి కూడా ఫుల్ ప్యాక్ అయిపోయింది. దీపావళికి ‘కె.జి.యఫ్ 2’ రిలీజ్ అవుతోంది. ఇండియా వైడ్‌గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ‘కె.జి.యఫ్’ పార్ట్ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ ‘లైగర్’ కూడా దీపావళి రేస్‌లో ఉండే ఛాన్సుంది. సెప్టెంబర్ 9 న ‘లైగర్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా.. అప్పటికి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ అయ్యేంత టైమ్ లేదు కాబట్టి .. ఈ సినిమా కూడా నవంబర్ షెడ్యూల్ చేసుకుంటోంది.

పెద్ద సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకోగానే.. గ్యాప్ చూసుకుని ‘గని’, ‘శ్యామ్ సింగ రాయ్’, ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’, ‘సీటీమార్’, ‘మ్యాస్ట్రో’, ‘మేజర్’, ‘మహాసముద్రం’ లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నాయి. ఫస్ట్ సిక్స్ మంత్స్ మొత్తం డల్‌గా ఉన్నా.. వచ్చే 6 నెలలు మాత్రం థియేటర్ల నిండా సినిమాలతో ఫుల్ ప్యాక్ అయిపోయింది టాలీవుడ్ డైరీ.