Pawan Kalyan 3 Marriages : అసలు పెళ్లే చేసుకోవాలనుకోలేదు.. మూడు పెళ్లిళ్లపై పవన్ క్లారిటీ.. బాలయ్య వార్నింగ్.

షోలో అందరూ అనుకున్న మూడు పెళ్లిళ్ల విషయం గురించి కూడా బాలకృష్ణ అడిగాడు. ఇప్పటికే ఈ ప్రశ్నకి పవన్ కళ్యాణ్ అనేకసార్లు సమాధానం చెప్పాడు. అయిన ఏపీలోని పవన్ వ్యతిరేక నాయకులు ఈ పాయింట్ మీదే పవన్ ని తిడుతూ ఉంటారు. దీంతో అన్‌స్టాపబుల్ షోలో మరోసారి బాలయ్య మూడు పెళ్లిళ్ల గురించి అడగగా పవన్ సమాధానమిచ్చాడు................

Pawan Kalyan 3 Marriages : అసలు పెళ్లే చేసుకోవాలనుకోలేదు.. మూడు పెళ్లిళ్లపై పవన్ క్లారిటీ.. బాలయ్య వార్నింగ్.

Pawan Kalyan reacts on his 3 Marriages at Unstoppable show

Pawan Kalyan 3 Marriages :  బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీ లో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సెకండ్ సీజన్ మరింత పాపులార్ అయింది. ఇక సెకండ్ సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షో దేశవ్యాప్తంగా మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఈ ఎపిసోడ్ తో సరికొత్త రికార్డులు సృష్టించింది ఈ షో. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ షూటింగ్ మొదలయిన దగ్గర్నుంచి బాలయ్య, పవన్ అభిమానులు హంగామా చేస్తూనే ఉన్నారు. బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని ఆహా ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటల నుండి స్ట్రీమింగ్ చేశారు.

పవన్ అభిమానులు, అటు బాలకృష్ణ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. రిలీజయిన కొద్దిసేపటికే చాలామంది చూసి సరికొత్త రికార్డులని సెట్ చేశారు. కొన్ని చోట్ల అభిమానులు ఈ షోని స్పెషల్ ప్రివ్యూ వేశారు. అయితే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ మొదటి ఎపిసోడ్ లో పవన్ ఫ్యామిలీ, సినిమాలు గురించి మాట్లాడారు. ఇక రెండో ఎపిసోడ్ లో రాజకీయాలు మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. బాలయ్య – పవన్ ఎపిసోడ్ లో అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు.

ఇక షోలో అందరూ అనుకున్న మూడు పెళ్లిళ్ల విషయం గురించి కూడా బాలకృష్ణ అడిగాడు. ఇప్పటికే ఈ ప్రశ్నకి పవన్ కళ్యాణ్ అనేకసార్లు సమాధానం చెప్పాడు. అయిన ఏపీలోని పవన్ వ్యతిరేక నాయకులు ఈ పాయింట్ మీదే పవన్ ని తిడుతూ ఉంటారు. దీంతో అన్‌స్టాపబుల్ షోలో మరోసారి బాలయ్య మూడు పెళ్లిళ్ల గురించి అడగగా పవన్ సమాధానమిచ్చాడు.

Pawan-Charan : చరణ్-పవన్ అనుబంధం.. సీక్రెట్స్ చెప్పిన చరణ్..

పవన్ తన మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ.. నేను అసలు పెళ్లే చేసుకోవాలి అనుకోలేదు. అనుకోకుండా మొదటి పెళ్లి ఇంట్లో వాళ్ళు చూసింది చేసుకున్నా. కుదరక విడిపోయాము. ఇద్దరిమధ్య విభేదాలు, అభిప్రాయబేధాలు వస్తాయి, అది సహజం అందుకే ఇద్దరికీ ఇష్టపూర్వకంగానే విడిపోయాము. రెండో సారి కూడా పెళ్లి చేసుకున్నా కొన్నేళ్ల తర్వాత మా మధ్య బేధాలు వచ్చాయి. విడిపోయాము. నేను ముగ్గుర్ని ఒకేసారి చేసుకోలేదురా బాబు అని చెప్తూనే ఉన్నాను. మా మధ్య కుదరక విడాకులు అయ్యాయి. అంతేకాని నేను వ్యామోహంతో మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు. విడాకులు ఇచ్చి చట్టపరంగా చేసుకున్నాను. వీళ్లంతా ఒకేసారి చేసుకున్నట్టు మాట్లాడతారు. పాలిటిక్స్ లో నన్ను తిట్టడానికి వాళ్ళ దగ్గర వేరే ఏమి లేదు, నేను ఏ అవినీతి చేయను, ఎవర్ని ఏమి అనను. అందుకే ఇదొక్కటి వాళ్ళకి తిట్టడానికి బాగా పనికొచ్చింది. నేను పట్టించుకోను, నాకైతే నేను చేసిన దాంట్లో తప్పు లేదు అని నమ్మకం. నేను సెలెబ్రిటీ అవ్వడం వల్లే ఇలా అయింది. కాని నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చేసుకున్నారు. కాకపోతే వాళ్ళెవ్వరూ బయటకి తెలియదు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడారు. అలాగే వాళ్ళకి విజ్ఞత, సంస్కారం లేదు కాబట్టి పెళ్లిళ్ల గురించి, ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు. నేను ఇంట్లోని ఆడవాళ్ళని తీసుకొచ్చి తిట్టను. నాకు సంస్కారం, సభ్యత, విజ్ఞత ఉన్నాయి. వాళ్ళు అవి ఆలోచించరు కాబట్టి పెళ్లి టాపిక్ తీసుకొస్తారు. మళ్ళీ చెప్తున్నా ఇద్దరిమధ్య విభేదాలు వచ్చి చట్టపరంగా విడాకులు తీసుకొని ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నాను అంతేకాని నేను ముగ్గుర్ని ఒకేసారి చేసుకోలేదు, ముగ్గురితో కలిసి ఉండట్లేదు అని తెలిపాడు. దీనిపై బాలకృష్ణ కూడా మాట్లాడుతూ.. ఇంకోసారి పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడితే ఎవరైనా సరే ఊరకుక్కలతో సమానం అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాలిటిక్స్ లో పవన్ మూడు పెళ్లిళ్ల గురించి ఎవరైనా మాట్లాడతారేమో చూడాలి.