Pawan Kalyan on Tej Accident : సాయిధరమ్ తేజ్ చావు దాకా వెళ్ళొచ్చాడు.. తేజ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడిన పవన్..

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయిందని నాకు త్రివిక్రమ్ ఫోన్ చేసి చెప్పాడు. దాంతో ఇద్దరం కలిసి హాస్పిటల్ కి వెళ్ళాం. నాలుగు రోజులైనా డాక్టర్స్ ఏం చెప్పలేం అన్నారు. చాలా బాధ అనిపించింది. సాయిధరమ్ తేజ్ చావు దాకా వెళ్ళొచ్చాడు. ఆ సమయంలో...............

Pawan Kalyan on Tej Accident : సాయిధరమ్ తేజ్ చావు దాకా వెళ్ళొచ్చాడు.. తేజ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడిన పవన్..

Pawan Kalyan on Tej Accident :  బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీ లో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సెకండ్ సీజన్ మరింత పాపులార్ అయింది. ఇక సెకండ్ సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షో దేశవ్యాప్తంగా మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఈ ఎపిసోడ్ తో సరికొత్త రికార్డులు సృష్టించింది ఈ షో. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ షూటింగ్ మొదలయిన దగ్గర్నుంచి బాలయ్య, పవన్ అభిమానులు హంగామా చేస్తూనే ఉన్నారు. బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని ఆహా ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటల నుండి స్ట్రీమింగ్ చేశారు.

పవన్ అభిమానులు, అటు బాలకృష్ణ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. రిలీజయిన కొద్దిసేపటికే చాలామంది చూసి సరికొత్త రికార్డులని సెట్ చేశారు. కొన్ని చోట్ల అభిమానులు ఈ షోని స్పెషల్ ప్రివ్యూ వేశారు. అయితే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ మొదటి ఎపిసోడ్ లో పవన్ ఫ్యామిలీ, సినిమాలు గురించి మాట్లాడారు. ఇక రెండో ఎపిసోడ్ లో రాజకీయాలు మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. బాలయ్య – పవన్ ఎపిసోడ్ లో అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు.

ఇటీవల కొన్ని నెలల క్రితం సాయి ధరమ్ తేజ్ బైక్ మీద నుండి పడి యాక్సిడెంట్ అయినా సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెంట్ లో చాలా ఎక్కువగా ఇంజ్యుర్ అయ్యాడు తేజ్. దాన్నుంచి తేజ్ పూర్తిగా కోలుకోవడానికి చాలా టైం పట్టింది. షోలో బాలకృష్ణ తేజ్ యాక్సిడెంట్ గురించి ప్రస్తావించాడు. పవన్ కళ్యాణ్ తేజ్ యాక్సిడెంట్ పై రియాక్ట్ అయిందా దాని గురించి మాట్లాడాడు. దీంతో పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడాడు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయిందని నాకు త్రివిక్రమ్ ఫోన్ చేసి చెప్పాడు. దాంతో ఇద్దరం కలిసి హాస్పిటల్ కి వెళ్ళాం. నాలుగు రోజులైనా డాక్టర్స్ ఏం చెప్పలేం అన్నారు. చాలా బాధ అనిపించింది. సాయిధరమ్ తేజ్ చావు దాకా వెళ్ళొచ్చాడు. ఆ సమయంలో మీడియా వాళ్ళు ఓవర్ చేశారు. అతను గురించి నాకు తెలుసు. అది సాధారణంగా జరిగిన యాక్సిడెంట్. అలా ఎవరికైనా అనుకోకుండా జరుగుతుంది. అందుకే తేజ్ కోసం నిలబడ్డా, మాట్లాడాను. తేజ్, వైష్ణవ్ కూడా ఇద్దరూ నాకు చిన్నప్పట్నుంచి క్లోజ్ అని తెలిపి ఎమోషనల్ అయ్యాడు.

ఆ తర్వాత షోకి సాయి ధరమ్ తేజ్ కూడా వచ్చాడు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. బాలయ్యకి ఫ్యాన్ ని, పవన్ కి శిష్యుడిని అని చెప్పాడు బాలయ్య అడగడంతో. అలాగే పెళ్లి చేసుకోను, తప్పదు అంటే ఇంట్లో వాళ్ళు చేస్తే చేసుకోవాలి అన్నాడు. పవన్ ని ఏదైనా అడగలనుకుంటున్నావా అంటే చిన్నప్పుడు ఆయనే మమ్మల్ని పెంచాడు. బొమ్మలతో ఎలా ఆడుకోవాలో ఆయనే నేర్పించాడు. మాకు చాలా విషయాలు మామయ్య నేర్పించాడు. ఆయనతో మళ్ళీ చిన్నప్పుడు ఆడుకున్నట్టు ఆడుకోవాలని ఉంది. నేను, వైష్ణవ్, అకిరా రెడీ మామయ్య ఆడిస్తే అనడంతో పవన్ చూద్దాం అని అన్నాడు.

ఇక మామయ్య నీకు కెరీర్ లో ఎలా హెల్ప్ చేశాడు అని బాలయ్య అడగగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. కెరీర్ లో అంటే నేనే ముందు యాక్టింగ్ చేస్తాను అని చెప్పా మామయ్యకు చెప్పాను. ఓకే అన్నారు. నేను నా ఫొటోస్ తీసుకొని ప్రతి ఆఫీస్ కి వెళ్లి అవకాశాలు ట్రై చేసేవాడిని. మెగా ఫ్యామిలీ అని చెప్పేవాడ్ని కాదు. ఒకరోజు మామయ్య పిలిచి ఎలా వెళ్తున్నావు ఆడిషన్స్ కి అని అడిగితే ఆటోలో అని చెప్పాను. కార్ కీస్ ఇచ్చి వేసుకెళ్ళమన్నారు. ఆ తర్వాత మామయ్యే బాంబేలో ఓ యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ చేశారు. ఒకసారి ఫ్లయిట్ మిస్ అయ్యాను. ఎవరికన్నా చెప్తే తిడతారేమో అని మామయ్యకి చెప్తే నీకు డబ్బు విలువ తెలీదు, తెలుసుకో అని చెప్పారు. హీరో అయ్యాక.. ఒక్కో శుక్రవారం ఇండస్ట్రీలో ఒక్కొక్కరిది ఎవరి మీద ఈర్ష పెంచుకోకు అని చెప్పారు.

Pawan Kalyan 3 Marriages : అసలు పెళ్లే చేసుకోవాలనుకోలేదు.. మూడు పెళ్లిళ్లపై పవన్ క్లారిటీ.. బాలయ్య వార్నింగ్.

దీని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఒక్కరోజే మనది. 365 రోజులు మనవి కాదు. అందరి మధ్య హెల్తీ కాంపిటేషన్ ఉండాలి. ఈర్ష్య ఉండకూడదు కళాకారులకి. ఎవరిని చూసి ఈర్ష పడకూడదు. పోటీపడిన అందరూ కలిసే ఉండాలి, అందరూ బాగుండాలి అని అన్నారు. సాయి ధరమ్ తేజ్ రావడంతో షోకి మరింత హైప్ వచ్చింది.