Bro : ‘మార్క్’ని పరిచయం చేస్తాను అంటున్న బ్రో.. రెడీగా ఉండండి మెగా ఫ్యాన్స్!

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలోని మార్క్ పాత్రని రేపు పరిచయం చేస్తామంటూ..

Bro : ‘మార్క్’ని పరిచయం చేస్తాను అంటున్న బ్రో.. రెడీగా ఉండండి మెగా ఫ్యాన్స్!

Pawan Kalyan Sai Dharam tej Bro movie update is coming tomorrow

Bro : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam tej) కలిసి నటిస్తున్న చిత్రం Bro. తమిళ సినిమా ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా వస్తుంది. ఫాంటసీ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సముద్రఖని డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఈ రీమేక్ ని కూడా సముద్రఖనినే తెరకెక్కిస్తున్నాడు. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసిన మేకర్స్.. ఇప్పుడు బ్యాలన్స్ షూట్ ని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఇక ఇటీవల ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ పవన్ లుక్ ని రివీల్ చేసిన విషయం తెలిసిందే.

Ram Charan : G20 సమ్మిట్‌లో రామ్ చరణ్ ‘నాటు నాటు’ స్టెప్.. వీడియో వైరల్!

టైటిల్ అండ్ పవన్ లుక్ పై ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించింది. మొత్తానికి మేకర్స్ మూవీ పై భారీ క్యూరియోసిటీని క్రియేట్ చేశారు. ఇక ఆ ఆసక్తిని మరింత పెంచేందుకు ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో బ్రో ఫ్రెండ్ అయిన మార్క్ ని రేపు సాయంత్రం 4:14 నిమిషాలకు పరిచయం చేస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. మార్క్ అనేది ఈ సినిమాలో సాయి ధరమ్ క్యారెక్టర్ పేరు అని తెలుస్తుంది. మరి రేపు ఇచ్చే అప్డేట్ తో ఎటువంటి అంచనాలు క్రియేట్ చేస్తారో చూడాలి.

Ram Charan : 2016లో ఇదే ఆడిటోరియంలో సినిమా షూట్ చేశాం.. ఇప్పుడు సమ్మిట్‌లో పాల్గొన్నా.. రామ్‍చరణ్!

కాగా ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కేతిక శర్మ (Ketika Sharma) సాయి ధరమ్ కి జోడిగా కనిపించబోతుందని తెలుస్తుంది. అలాగే ప్రియా వారియర్ చెల్లి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ జులై 28న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.