Pawan Kalyan : సిగ్గుతో చచ్చిపోయా.. వదినకి కాల్ చేసి ఇదే లాస్ట్ సినిమా అని చెప్పాను..

షోలో బాలకృష్ణ.. నీకు చాలా సిగ్గు ఎక్కువ కదా. సినిమా లైఫ్ లో కానీ బయట కానీ బాగా ఇబ్బందిపడ్డ సందర్భం. అసలు నా వల్ల కాదు అనుకున్న సందర్భం ఏమైనా ఉందా అని అడిగాడు. పవన్ కళ్యాణ్ దీనికి సమాధానమిస్తూ...............

Pawan Kalyan : సిగ్గుతో చచ్చిపోయా.. వదినకి కాల్ చేసి ఇదే లాస్ట్ సినిమా అని చెప్పాను..

Pawan Kalyan shares his most embarrassed moment in cinema life

Pawan Kalyan :  బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీ లో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. సెకండ్ సీజన్ మరింత పాపులార్ అయింది. ఇక సెకండ్ సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షో దేశవ్యాప్తంగా మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఈ ఎపిసోడ్ తో సరికొత్త రికార్డులు సృష్టించింది ఈ షో. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ షూటింగ్ మొదలయిన దగ్గర్నుంచి బాలయ్య, పవన్ అభిమానులు హంగామా చేస్తూనే ఉన్నారు. బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని ఆహా ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటల నుండి స్ట్రీమింగ్ చేశారు.

పవన్ అభిమానులు, అటు బాలకృష్ణ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. రిలీజయిన కొద్దిసేపటికే చాలామంది చూసి సరికొత్త రికార్డులని సెట్ చేశారు. కొన్ని చోట్ల అభిమానులు ఈ షోని స్పెషల్ ప్రివ్యూ వేశారు. అయితే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ మొదటి ఎపిసోడ్ లో పవన్ ఫ్యామిలీ, సినిమాలు గురించి మాట్లాడారు. ఇక రెండో ఎపిసోడ్ లో రాజకీయాలు మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. బాలయ్య – పవన్ ఎపిసోడ్ లో అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు.

Balayya-Pawan : బాలయ్య బాబు – పవన్ మధ్య ఇంత స్నేహం ఉందా??

షోలో బాలకృష్ణ.. నీకు చాలా సిగ్గు ఎక్కువ కదా. సినిమా లైఫ్ లో కానీ బయట కానీ బాగా ఇబ్బందిపడ్డ సందర్భం. అసలు నా వల్ల కాదు అనుకున్న సందర్భం ఏమైనా ఉందా అని అడిగాడు. పవన్ కళ్యాణ్ దీనికి సమాధానమిస్తూ.. సుస్వాగతం సినిమా టైములో వైజాగ్ జగదాంబ సెంటర్ లో బస్సు పై నించొని డ్యాన్స్ వేయమన్నారు. చుట్టూ జనాలు ఉన్నారు. నాకు మామూలుగానే చాలా సిగ్గు. ఇంక అదే చెప్పేసరికి చచ్చిపోయినంత పనయింది. లారెన్స్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్. వదినకి కాల్ చేసి ఇంక నా వల్ల కాదు, వీళ్ళు ఏమేమో చేయిస్తున్నారు. ఇదే నా లాస్ట్ సినిమా, ఇంక సినిమాలు చేయను అని చెప్పాను అంటూ తెలిపాడు. దీంతో బాలయ్య.. అప్పుడు బస్సు మీద నించొని డ్యాన్స్ వేయడానికి భయపడ్డావు. ఇప్పుడు బస్సు మీద నించొని లక్షల ప్రజల ముందు ధైర్యంగా మాట్లాడుతున్నావు అంటూ పొగిడారు.