Pawan Kalyan : వామ్మో.. ‘బ్రో’ సినిమాలో.. పవన్ కళ్యాణ్ షూస్ కాస్ట్ మరీ అంతా?

బ్రో సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ వేసుకున్న షూస్ స్టైలిష్ గా, వెరైటీగా ఉండటంతో పవన్ అభిమానులు ఆ షూ గురించి తెగ వెతికేశారు. నలుపు, తెలుపు మిక్స్ కలర్ లో ఆ షూస్ ఉన్నాయి.

Pawan Kalyan : వామ్మో.. ‘బ్రో’ సినిమాలో.. పవన్ కళ్యాణ్ షూస్ కాస్ట్ మరీ అంతా?

Pawan Kalyan shows cost in Bro Movie do you know howmuch

Pawan Kalyan Shoes : పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కలిసి నటిస్తున్న సినిమా బ్రో(Bro). తమిళ్ లో సూపర్ హిట్ ఆయన వినోదయ సితం(Vinodaya Sitham) సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ సినిమా. సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. బ్రో సినిమాను 28 జులై 2023న రిలీజ్ చేస్తారని ప్రకటించారు.

ఇటీవల పవన్, సాయి ధరమ్ తేజ్ కలిసి ఉన్న ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇందులో హార్లే డేవిడ్ సన్ బైక్ పై పవన్ స్టైల్ గా కాలు పెట్టి నిల్చోగా, తేజ్ పవన్ వెనక నించొని పవన్ పై చేతులు వేశాడు. ఈ పోస్టర్ ని అభిమానులు వైరల్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో పవన్ వేసుకున్న షూస్ ఇప్పుడు చర్చగా మారాయి. మన సెలబ్రిటీలు ధరించే డ్రెస్ లు, షూస్, వాచ్ లు ఇలాంటివన్నీ అభిమానులు గమనించి మరీ అవి ఎక్కడ దొరుకుతాయి, వాటి కాస్ట్ ఎంతో వెతికేస్తూ ఉంటారు.

Ira Khan : ఆటోలో ప్రయాణించిన అమీర్ ఖాన్ కూతురు.. వీడియో వైరల్..

బ్రో సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ వేసుకున్న షూస్ స్టైలిష్ గా, వెరైటీగా ఉండటంతో పవన్ అభిమానులు ఆ షూ గురించి తెగ వెతికేశారు. నలుపు, తెలుపు మిక్స్ కలర్ లో ఆ షూస్ ఉన్నాయి. అయితే ఇవి పారిస్ కు చెందిన లగ్జరీ బ్రాండ్ బల్మైన్ కంపెనీకి చెందినవి. వీటి ధర ఇండియన్ కరెన్సీ లో దాదాపు లక్ష ఆరువేలు. దీంతో ఈ ధర చూసి షూస్ కి అంత రేటా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ షూస్ కావాలంటే డైరెక్ట్ ఆ కంపెనీ సైట్ నుంచే ఆర్డర్ చేసుకోవాలట. బయట విడిగా ఈ షూస్ దొరకవు అని సమాచారం. మరి మీలో ఎవరైనా ఈ లక్ష రూపాయల షూస్ ట్రై చేస్తారా?