ప్రైవేటు పార్టులో పవన్ కళ్యాణ్ పచ్చబొట్టు వేయించుకున్న అశురెడ్డి

  • Published By: madhu ,Published On : July 13, 2020 / 09:44 AM IST
ప్రైవేటు పార్టులో పవన్ కళ్యాణ్ పచ్చబొట్టు వేయించుకున్న అశురెడ్డి

టాలీవుడ్ లో Pawan Kalyan స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే..చాలు…ఫ్యాన్స్ చేసే హంగామా అంతాఇంతా కాదు. కొన్ని రోజుల పాటు..సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ వేసి రాజకీయల్లోకి వచ్చారు ఈ గబ్బర్ సింగ్. ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్న పవన్ కు ఎంతో మంది అభిమానులున్నారు.

వీళ్ల అభిమానం హద్దులు దాటిపోతుంటుంది. తమకు పవన్ అంటే ఎంతో అభిమానం అని స్వయంగా…సినీ రంగానికి చెందిన నటులు కొంతమంది వెల్లడిస్తుంటారు. తాజాగా…ఇందులో…బిగ్ బాస్ కంటెస్ట్ అశురెడ్డి కూడా చేరారు. ఏకంగా పచ్చబొట్టు వేయించుకుని తన అభిమానాన్ని చాటుకుంది.

జూనియర్ సమంతగా సోషల్ మీడియలో పాపులర్ అయిన ఈ బ్యూటీ…ప్రైవేటు పార్టులో పవన్ కళ్యాణ్ పేరును పొడిపించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఒంటిపై చెరిగిపోని పచ్చబొట్టు వేయించుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ అంటే..ఎంత పిచ్చో తెలియదు..నేను ఆయన అభిమాని కాదు…భక్తురాలిని అంటూ చెప్పుకొచ్చింది.

యూఎస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సరదాగా డబ్‌స్మాష్ వీడియో ఒకటి చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ‘ఏమాయ చేసావె’ సినిమాలో సమంత డైలాగులతో ఈ వీడియో చేశారు. తొలి వీడియోతోనే అశురెడ్డి బాగా పాపులర్ అయిపోయారు.

జూనియర్ సమంత అంటూ ఆమెను కొనియాడారు. దీంతో అక్కడి నుంచి చాలా డబ్‌స్మాష్ వీడియోలను చేసి ఆమె సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియోలు ఆమెను సోషల్ మీడియా స్టార్‌ను చేశాయి.