Pawan Kalyan : నాటు నాటు ఆస్కార్ గెలవాలి.. పవన్ కళ్యాణ్!

రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' లోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ఒక ఇండియన్ సాంగ్ ఆస్కార్ బరిలో నిలవడం ఇదే మొదటిసారి. దీంతో దేశవ్యాప్తంగా మూవీ టీంకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అభినందిస్తూ ట్వీట్ చేశాడు.

Pawan Kalyan : నాటు నాటు ఆస్కార్ గెలవాలి.. పవన్ కళ్యాణ్!

pawan kalyan

Pawan Kalyan : టాలీవుడ్ జక్కన రాజమౌళి చెక్కిన అద్భుతమైన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ తో పాటు ప్రపంచ బాక్స్ ఆఫీస్ ని సైతం ఒక ఊపు ఊపేసింది. వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి గుర్తింపు రావడానికి ముఖ్య కారణం ‘నాటు నాటు’ సాంగ్ అనే చెప్పాలి. ఒక తెలుగు ఊర మాస్ నాటు సాంగ్ ప్రపంచాన్ని మొత్తం ఉర్రూతలూగించింది. ఇక ఈ పాటకి ఎన్టీఆర్ అండ్ చరణ్ వేసిన స్టెప్పులు విదేశీలకు సైతం పూనకాలు తెప్పించింది. తాజాగా ఈ పాట ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకొని చరిత్ర సృష్టించింది.

Pawan Kalyan Fan Dies : పవన్ కల్యాణ్ కొండగట్టు టూర్ లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో అభిమాని మృతి

ఒక ఇండియన్ సాంగ్ ఆస్కార్ బరిలో నిలవడం ఇదే మొదటిసారి. దీంతో దేశవ్యాప్తంగా మూవీ టీంకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అభినందిస్తూ ట్వీట్ చేశాడు. “ఆర్.ఆర్.ఆర్. చిత్రంలోని ‘నాటు నాటు’ గీతం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ పురస్కారానికి నామినేట్ కావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. మన తెలుగు పాట ఆస్కార్ కోసం తుది బరిలో పోటీపడటం అందరికీ గర్వ కారణం. ఇంతటి ప్రాచుర్యం పొందేలా గీతాన్ని స్వరపరచిన శ్రీ ఎమ్.ఎమ్.కీరవాణి గారికి హృదయపూర్వక అభినందనలు. ‘నాటు నాటు’ గీతం ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆస్కార్ బరిలో మన చిత్రం నిలిచేలా చేసిన దర్శకుడు శ్రీ రాజమౌళి, హీరోలు శ్రీ రాం చరణ్, శ్రీ ఎన్టీఆర్, నిర్మాత శ్రీ డి.వి.వి.దానయ్య, గీత రచయిత శ్రీ చంద్రబోస్, గాయకులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్, శ్రీ కాలభైరవ, ఇతర సాంకేతిక బృందానికి అభినందనలు” అంటూ ట్వీట్ చేశాడు.

కాగా ఈ పాట ఇప్పుడికే పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ తరువాత అత్యున్నత పురస్కారమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా అందుకుంది. దీంతో ఈ పాట ఆస్కార్ గెలుచుకోవడం పక్కా అంటున్నారు విదేశీలు సైతం. మార్చ్ 12 న అవార్డ్స్ అనౌన్స్‌మెంట్ జరగనుంది. నాటు నాటు ఆస్కార్ గెలుచుకుంటుందా? లేదా? అనేది తెలియాలి అంటే అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే.