Pawan Kalyan: దసరాకు వీరమల్లు.. పొంగల్‌పై కూడా కన్నేసిన ఉస్తాద్..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్‌సింగ్ అనే సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నాయి. ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Pawan Kalyan: దసరాకు వీరమల్లు.. పొంగల్‌పై కూడా కన్నేసిన ఉస్తాద్..?

Pawan Kalyan Ustaad Bhagat Singh Eyeing For Pongal Release

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’ సినిమాను మెజారిటీ శాతం పూర్తి చేసిన పవన్, తమిళ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వినోదయ సీతం’ చిత్ర రీమేక్‌లోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా ముగించేశాడు పవన్. అటు క్రిష్ డైరెక్షన్‌లో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాను దసరా బరిలో రిలీజ్ చేయాలని పవన్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది.

Pawan Kalyan OG : అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సుజిత్.. OG Is Coming!

ఇక మరో డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్‌సింగ్ అనే సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. అయితే, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను మొదులుపెట్టేందుకు డైరెక్టర్ హరీష్ శంకర్ హోం వర్క్ స్టార్ట్ చేశాడు. ఆయన లొకేషన్, సెట్స్ పనులలో బిజీగా ఉన్నారు. కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

Pawan Kalyan: ఏప్రిల్ మొత్తం బిజీబిజీ అంటోన్న పవన్..!

ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్ర షూటింగ్‌ను అతిత్వరలో ప్రారంభించి, ఈ సినిమాను వీలైనంత త్వరగా ముగించేయాలని ఆయన చూస్తున్నాడట. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా అంతే వేగంగా ముగించేసి, ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పవన్ కూడా ఈ ఆలోచనకు ఓకే చెప్పినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.