‘‘వకీల్ సాబ్’’ వచ్చేశాడు!..

  • Published By: sekhar ,Published On : September 2, 2020 / 09:31 AM IST
‘‘వకీల్ సాబ్’’ వచ్చేశాడు!..

Vakeel Saab Motion Poster: పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. బుధవారం (సెప్టెంబర్ 2) పవర్‌‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. పవన్ లాయర్ గెటప్‌లో అదిరిపోయాడు. తమన్ కంపోజ్ చేసిన ‘సత్యమేవ జయతే’ ఆర్ఆర్ బాగుంది.



తెలుగు నేటివిటీకి తగ్గట్టు, పవన్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నారు. మెసేజ్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ని కూడా సమానంగా చూపించనున్నామని, పవర్‌స్టార్‌కి ‘వకీల్ సాబ్’ పర్ఫెక్ట్ రీ ఎంట్రీ చిత్రం అవుతోందని నిర్మాతలు తెలిపారు.

హిందీ (పింక్), తమిళ్ (నేర్కొండపార్వై) భాషల్లో చిత్రాన్ని నిర్మించిన బోనీ కపూర్, దిల్ రాజుతో కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ అండ్ ‘మగువా మగువా’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.


‘వకీల్ సాబ్’ ఈ వేసవిలో విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడింది. త్వరలో బ్యాలెన్స్ షూటింగ్ ప్రారంభం కానుంది.