Chiru 154: చిరుతో పవన్ మల్టీస్టారర్.. అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు!

మెగాస్టార్ చిరంజీవి ఏ మాత్రం తగ్గడం లేదు. వరసగా సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య సినిమా విడుదలకి సిద్ధంగా ఉండగా మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాను..

Chiru 154: చిరుతో పవన్ మల్టీస్టారర్.. అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు!

Chiru 154

Chiru 154: మెగాస్టార్ చిరంజీవి ఏ మాత్రం తగ్గడం లేదు. వరసగా సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య సినిమా విడుదలకి సిద్ధంగా ఉండగా మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాను షూటింగ్ స్టార్ట్ చేశాడు. మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా కూడా మొదలు కానుంది. ఇవి రెండు కాకుండా మూడవ సినిమాను కూడా మొదలు పెట్టాడు. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో సినిమాను మొదలు పెట్టారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Peddanna: భారీ డిజాస్టర్ దిశగా పెద్దన్న.. రజనీ సార్ ఎందుకిలా?

ఇప్పటికే ఈ సినిమా నుండి వదిలిన మాస్ లుక్ అభిమానులను ఒక్కసారిగా అలెర్ట్ చేసింది. ఇందులో చిరు స్టైలిష్‌గా బీడీ వెలిగిస్తుంటే అభిమానులు ముఠామేస్త్రి లాంటి రోజులను గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఈ సినిమా కూడా ముఠామేస్త్రి లాంటి పక్కా మాస్ మసాలా సినిమా అని దర్శక, నిర్మాతలు ఓపెన్ గానే చెప్పేశారు. వైజాగ్ పోర్ట్ నేపథ్యంలో సాగే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది అని లీకులు, చర్చలు కూడా జరుగుతున్నాయి. కాగా, మరోవైపు ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అంశం ఒకటి సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తుంది.

Jr NTR : ఇట్స్ పార్టీ టైమ్.. తారక్ పిక్స్ వైరల్..

ఈ సినిమాలో చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం సాగుతోండగా ఇందులో చిరంజీవి పాత్రకి తగ్గట్లే తమ్ముడి పాత్ర ఒకటి ఉందట. సినిమాలో ఈ పాత్ర చాలా బలంగా ఉండడంతో పాటు సినిమాకి చాలా అవసరం కూడా ఉంటుందట. ఇలాంటి పాత్రలో నిజమైన తమ్ముడు పవన్ కళ్యాణ్ నటిస్తే ఈ సినిమా మైలేజ్ పెరగడంతో పాటు అభిమానులకు కన్నుల పండగగా ఉంటుంది. అందుకే బాబీ ఇప్పుడు పవన్ ను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. మరి అదే నిజమైతే అభిమానులను ఆనందానికి హద్దులు ఉండవేమో!