Pawan kalyan : 30 రోజుల్లో 50 కోట్లు.. పవన్ టార్గెట్ అదేనా?

భీమ్లానాయక్ తర్వాత హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ ఉంటుందనుకున్నారంతా. కాని, పవన్ కళ్యాన్ మాత్రం వినోదయ సీతం తెలుగు రీమేక్ చేసేందుకు................

Pawan kalyan : 30 రోజుల్లో 50 కోట్లు.. పవన్ టార్గెట్ అదేనా?

Pawan

Pawan kalyan :  పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూర్ ప్రకటించిన దగ్గర నుంచి ఆయన కమిట్ అయిన సినిమాల్లో ఏది పూర్తవుతుందో ఏది ఆగిపోతుందో అనే టెన్షన్ పవన్ ఫ్యాన్స్ లోనే కాదు, ఆ సినిమాల దర్శక నిర్మాతల్లోనూ ఉంది. అయితే పవన్ మాత్రం వినోదయా సీతం తెలుగు రీమేక్ పూర్తి చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భవదీయుడు భగత్ సింగ్ కంటే వినోదయ సీతం రీమేక్ కి పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతున్నాడు.

భీమ్లానాయక్ తర్వాత హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ ఉంటుందనుకున్నారంతా. కాని, పవన్ కళ్యాన్ మాత్రం వినోదయ సీతం తెలుగు రీమేక్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గద్దల కొండ గణేష్ తర్వాత మరో సినిమా చేయకుండా పవన్ కోసం వెయిట్ చేస్తున్నాడు హరీష్ శంకర్. 2021 సెప్టెంబర్ 9న భవదీయుడు భగత్ సింగ్ సినిమాని అనౌన్స్ చేసినా, ఇప్పటి వరకు ముహూర్తం షాట్ కూడా తీయలేదు. కాని, ఇప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా వినోదయ సీతం రీమేక్ సినిమా పూర్తి చేసేందుకు రెడీ అయ్యాడు పవర్ స్టార్. ఈ సినిమాకు సంబంధించి జులై చివరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Vishwaksen : టైగర్స్‌తో మాస్ కా దాస్ విశ్వక్

దసరా నుంచి పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూర్ స్టార్ట్ అవుతుంది. దాంతో పవన్ బిజీ అయిపోతాడు. పవన్ సినిమాలు చేయడానికి ముఖ్యకారణం డబ్బులు కూడా. ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలకి ఎక్కువ కాల్షీట్స్ ఇవ్వాలి. అదే వినోదయ సీతం రీమేక్ అయితే 30 రోజుల్లో పూర్తి చేసేయొచ్చు. రెమ్యునరేషన్ 50 కోట్లు వస్తుంది. నెలల తరబడి డేట్స్ ఇచ్చి అదే రెమ్యునరేషన్ తీసుకోవడం కంటే 30 రోజులు డేట్స్ ఇచ్చి అదే రెమ్యునరేషన్ తీసుకోవడం బెటర్ అని పవన్ భావించారు. దీంతో వినోదయ సీతాం సినిమాకి పవన్ 30 డేస్ కాల్షీట్స్ కేటాయించారు. తమిళ్ లో మెయిన్ లీడ్ లో నటిస్తూ డైరెక్షన్ చేసిన సముద్రఖని తెలుగు రీమేక్ ని డైరెక్షన్ చేస్తున్నాడు.

గతంలో భీమ్లా నాయక్ కూడా ఇలాగే చేశాడు పవన్. తక్కువ రోజుల్లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయని అప్పటికే ఒప్పుకున్న హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ పక్కన పెట్టి భీమ్లానాయక్ చేశాడు. అది కూడా రీమేక్ సినిమానే. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఫాలో అవుతున్నాడు పవన్. తన రాజకీయ కమిట్మెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని పవన్ ఈ పనులు చేస్తున్నాడు. కానీ ఇది అభిమానులకి కూడా నచ్చట్లేదు. ఇప్పటికే పవన్ కెరీర్ లో ఎక్కువ రీమేక్ సినిమాలు ఉన్నాయి. కంబ్యాక్ ఇచ్చిన తర్వాత వచ్చిన రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాతో అయినా డైరెక్ట్ ఫిలిం తీస్తాడు అనుకుంటే డబ్బుల కోసం మళ్ళీ రీమేక్ వెంట పడుతున్నాడు పవన్.