Payal Rajputh : మొన్నటిదాకా రియల్ లైఫ్ లో.. ఇప్పుడు రీల్ లైఫ్ లో.. ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న పాయల్

పూర్ణ, ఈషా రెబ్బ, పాయల్ ముగ్గురు హీరోయిన్స్ గా ‘త్రీ రోజెస్‌’ అనే తెలుగు వెబ్‌సిరీస్‌ని తీస్తున్నారు. ఈ సిరీస్ ఆహాలో రానుంది. అయితే ఇందులో పాయల్ జోడిగా పాయల్ బాయ్ ఫ్రెండ్ ని

Payal Rajputh : మొన్నటిదాకా రియల్ లైఫ్ లో.. ఇప్పుడు రీల్ లైఫ్ లో.. ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న పాయల్

Payal (1)

Payal Rajputh : ఇటీవల పాయల్ రాజ్ పుత్ తన ప్రియుడు అంటూ సౌరభ్‌ ధింగ్రాని పరిచయం చేసింది. త్వరలోనే పాయల్ హైదరాబాద్ కి కూడా షిఫ్ట్ అవుతుంది. హైదరాబాద్ లో పాయల్ ఉండే ఇల్లు సౌరభ్ దగ్గరుండి మరీ సెలెక్ట్ చేసి డిజైన్ చేపించాడని పాయల్ చెప్పింది. వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తూ ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇన్నిరోజులు రియల్ లైఫ్ లో ప్రియుడితో కలిసి రొమాన్స్ చేసిన పాయల్ ఇప్పుడు రీల్ లైఫ్ లో కూడా రొమాన్స్ చేస్తుంది.

Romantic : నువ్వు హిట్ కొట్టాలి.. మీ నాన్న కాలర్ ఎత్తాలి : విజయ్ దేవరకొండ

పూర్ణ, ఈషా రెబ్బ, పాయల్ ముగ్గురు హీరోయిన్స్ గా ‘త్రీ రోజెస్‌’ అనే తెలుగు వెబ్‌సిరీస్‌ని తీస్తున్నారు. ఈ సిరీస్ ఆహాలో రానుంది. అయితే ఇందులో పాయల్ జోడిగా పాయల్ బాయ్ ఫ్రెండ్ ని తీసుకోవడం విశేషం. అంతకుముందు ఈ జంట కలిసి ‘మౌలా మేరా మౌలా’ అనే మ్యూజిక్‌ వీడియోలో నటించారు. ఇందులో వారిద్దరి స్క్రీన్‌ప్రజెన్స్‌ నచ్చడంతో ‘త్రీ రోజెస్‌’ దర్శకుడు మారుతి ఈ సిరీస్‌ కోసం తీసుకున్నారని పాయల్ తెలిపింది. తెరపై తామిద్దరం కలిసి నటించడం ఓ మ్యాజిక్‌లా జరిగిపోయిందని చెప్పింది. తొలుత నన్ను ఒక హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఆ తర్వాత సౌరభ్‌ను ఒక హీరోగా తీసుకుంటున్నామని దర్శకుడు చెప్పడంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది. మా ఇద్దరి మధ్య రొమాంటిక్‌ ఎపిసోడ్స్‌ అందర్నీ ఆకట్టుకుంటాయి. రియల్‌లైఫ్‌లోనే కాదు రీల్‌లైఫ్‌లో కూడా మా జోడీ చాలా బాగుంటుంది అని పాయల్ తెలిపింది.