Payal Rajput: బోల్డ్ అంటే ఇదే.. స్టేజ్‌పైనే లిప్‌లాక్ ఇచ్చేసిన పాయల్!

మరాఠీ చిత్రం సైరత్ పంజాబీ రీమేక్‌తో సినీ ఇండ్రీస్టీలోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. తెలుగులో ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది.

Payal Rajput: బోల్డ్ అంటే ఇదే.. స్టేజ్‌పైనే లిప్‌లాక్ ఇచ్చేసిన పాయల్!

Payal Rajput

Payal Rajput: మరాఠీ చిత్రం సైరత్ పంజాబీ రీమేక్‌తో సినీ ఇండ్రీస్టీలోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. తెలుగులో ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది. ఆ తర్వాత ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘వెంకీ మామ’, ‘డిస్కోరాజా’ సినిమాలో మెరిసింది. సినిమాలతో పలకరించినా పెద్దగా ఒరిగిందేమి లేదు. అయితే, కళ్లు చెదిరే అందంతోపాటు అందాలు ఆరబోయడానికి ఏమాత్రం వెనుకాడకుండా ఇప్పటికీ అవకాశాలను పట్టేస్తుంది.

Payal Rajput: వింటర్‌లో హీటెక్కించే పాయల్ అందాల ట్రెజరీ

ఆర్‌ఎక్స్‌100తోనే యూత్‌ మనసు కొల్లగొట్టిన పాయల్.. ఆ మూవీలో కార్తికేయతో కలిసి ఎన్నో బోల్డ్‌ సీన్లలో కనిపించింది. ఆ తర్వాత ఏ సినిమాలో అయినా ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా అందాల వడ్డనకు అసలు అడ్డే చెప్పాడని పేరు మాత్రం తెచ్చుకుంది. ప్రస్తుతం ఆది సాయికుమార్ సినిమాతో పాటు తెలుగులో మరో సినిమాలో కూడా నటిస్తున్న పాయల్.. ఆ సినిమాలో కూడా ఓ రేంజ్ స్కిన్ షోతో రెచ్చిపోయింది. ఇప్పటికే ఈ సినిమాల నుండి వచ్చిన పోస్టర్లు కూడా వైరల్ అయ్యాయి. కాగా.. ఇప్పుడు పాయల్ స్టేజ్ మీదనే బాయ్ ఫ్రెండ్ కి లిప్ లాక్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.

Payal Rajput : అయ్యయ్యో..! టాప్ లేపిన పాయల్ రాజ్ పుత్.. డిలీట్ చేసిన ఆ వీడియో ఇదే..!

రెండేళ్ల కిందట వాలెంటైన్స్‌ డే సందర్భంగా పాయల్ తన బాయ్‌ఫ్రెండ్‌ సౌరభ్ దింగ్రను పరిచయం చేసింది. అతనితో ఎన్నో ఏళ్లుగా ఆమె డేటింగ్‌లో ఉంది. ముంబైలో టీవీ నటిగా ఉన్నప్పటి నుంచే వీళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు కూడా వీళ్ల రిలేషన్‌షిప్‌ను ఇప్పటికే అంగీకరించాయి. దీంతో ఈ జంట పబ్లిగ్గానే రెచ్చిపోతోంది. ఈమధ్య జరిగిన ఓ స్టేజ్‌ షోలో ఇద్దరూ కలిసి పర్ఫామ్‌ చేశారు. ఈ పర్ఫార్మెన్స్‌ ముగిసిన తర్వాత పాయల్.. తన ప్రియుడికి స్టేజ్‌పైనే పెదాలపై ముద్దు పెట్టడంతో అక్కడున్న వాళ్లంతా షాక్‌ తిన్నారు. అన్నట్లు ఈ ఎపిసోడ్ ఈరోజు (మే 22) సాయంత్రం ప్రసారం కానుంది.