Pelli SandaD: పెళ్లిసందD ఓటీటీ డేట్ వచ్చేసిందోచ్!
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘పెళ్లిసందడి’ అప్పట్లో ఓ సెన్సేషన్. ఈ సినిమాతోనే హీరో శ్రీకాంత్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు.....
Pelli SandaD: దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘పెళ్లిసందడి’ అప్పట్లో ఓ సెన్సేషన్. ఈ సినిమాతోనే హీరో శ్రీకాంత్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు ఇదే పేరుతో మరోసారి పెళ్లిసందD అనే సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించగా, యంగ్ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ వహించారు.
PelliSandaD : దర్శకేంద్రుడి పుట్టినరోజున సందడి చేయనున్న‘పెళ్లిసందD’ రెండవ పాట..
అయితే ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కింది. కానీ.. సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం అనుకున్న స్థాయిలో చిత్ర యూనిట్ శ్రద్ధ తీసుకోకపోవడంతో, ఈ సినిమాను ప్రేక్షకులందరూ చూడలేకపోయారు. దీంతో ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తే చూడాలని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా.. తాజాగా ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో జూన్ 24న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
దీంతో ఈ సినిమాను చూడని ప్రేక్షకులు ఈసారి ఖచ్చితంగా చూసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా ఓ ముఖ్య పాత్రలో నటించడం విశేషం. కాగా ఈ సినిమాను గౌరీ రొణంకి తెరకెక్కించగా, ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె. ఫిలిం అసోసియేట్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి. ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందించడం విశేషం. మరి ఓటీటీలో పెళ్లిసందD చిత్రం ఎలాంటి సందడి చేస్తుందో చూడాలంటే జూన్ 24 వరకు వెయిట్ చేయాల్సిందే.
సందడి చేయడనికి సర్వం సిద్ధం!
వచ్చేస్తున్నాం, ఈ జూన్ 24వ తేదీన
అందరూ ఆహ్వానితులే!#PelliSandaDOnZEE5@Ragavendraraoba @mmkeeravaani @arkamediaworks @Shobu_ @boselyricist pic.twitter.com/e253jXZvan— ZEE5 Telugu (@ZEE5Telugu) June 22, 2022