Pelli SandaD : డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్

‘పెళ్లిసందD’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Pelli SandaD : డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్

Pelli Sandad

Pelli SandaD: హీరో శ్రీకాంత్, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుల కెరీర్లో ‘పెళ్లిసందడి’ సినిమా స్పెషల్ ఫిలిం.. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ‘పెళ్లిసందడి’ లో నటించిన శ్రీకాంత్ తనయుడు హీరోగా, రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన సినిమా ‘పెళ్లిసందD’.. రాఘవేంద్ర రావు శిష్యురాలు గౌరి రోనంకి దర్శకురాలిగా, శ్రీలీల కథానాయికగా పరిచయమయ్యారు.

Republic : ఓటీటీలో పరిస్థితి ఎలా ఉండబోతుంది?

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు యావరేజ్ టాక్‌ వచ్చినా మంచి కలెక్షన్లు రాబట్టింది. రాఘవేంద్ర రావు ఈ మూవీతో నటుడిగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇప్పుడు థియేట్రికల్ రన్ ఫైనల్ స్టేజ్‌కి వచ్చెయ్యడంతో ‘పెళ్లిసందD’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చెయ్యడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.

Pushpa – Akhanda : ఊరమాస్ టీజర్స్ లోడెడ్..

నవంబర్ చివరి వారంలో డిస్నీ+హాట్ స్టార్‌లో ‘పెళ్లిసందD’ స్ట్రీమింగ్ కాబోతుంది. కీరవాణి పాటలు, నటీనటుల పర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్‌కి మంచి ఫ్యూచర్ ఉందని ఈ సినిమా ప్రూవ్ చేసింది. థియేటర్‌లో చూడడం మిస్ అయిన వాళ్లు ఓటీటీలో ‘పెళ్లిసందD’ మూవీని ఎంజాయ్ చెయ్యొచ్చు.

Jr Soundarya : సౌందర్య మళ్లీ పుట్టిందా?జూనియర్ సౌందర్యను చూశారా!