Chiranjeevi : చిరంజీవి ట్వీట్‌పై పేర్ని నాని.. బిజీగా ఉన్నాం.. తర్వాత చూద్దాం

పేర్ని నాని మాట్లాడిన విషయాలపై, ఆన్ లైన్ టికెటింగ్ విధానంపై చిరంజీవి ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు. ఒకపక్క జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే టికెట్........

Chiranjeevi : చిరంజీవి ట్వీట్‌పై పేర్ని నాని.. బిజీగా ఉన్నాం.. తర్వాత చూద్దాం

Perni Nani

Chiranjeevi :  ఏపీలో గత కొద్ది నెలలుగా సినీ పరిశ్రమ, థియేటర్స్ సమస్యలపై చర్చలు నడుస్తున్నాయి. సినీ పెద్దలు ఏపీ సీఎం, మంత్రులని కలుస్తున్నారు. అయినా సినిమా ఇండస్ట్రీ విషయంలో సీఎం జగన్ తన తీరు మార్చట్లేదు. ఆయన తీసుకున్న నిర్ణయాలు నష్టాన్ని కలిగించేలా ఉన్నాయి తప్ప, ఎవరికీ లాభం చేకూర్చేలా లేవు. తాజాగా సినీ నియంత్రణ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. ఈ విషయం గురించి మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఇకపై బెనిఫిట్ షోలు, ఎక్సట్రా షోలు ఉండవని చెప్తూ టికెట్ రేట్లు కూడా భారీగా తగ్గించారు. అయితే ఇది సినీ పరిశ్రమకి పెద్ద దెబ్బే.

Akhanda : ఒకపక్క అల్లు అర్జున్.. మరో పక్క రాజమౌళి.. గట్టిగానే ప్లాన్ చేసిన బాలయ్య

తాజాగా పేర్ని నాని మాట్లాడిన విషయాలపై, ఆన్ లైన్ టికెటింగ్ విధానంపై చిరంజీవి ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు. ఒకపక్క జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే టికెట్ ధరలలో వెసులుబాటు గురించి పునరాలోచించాలని చిరంజీవి కోరారు. భారీ బడ్జెట్ సినిమాలకు ఇంత తక్కువ టికెట్ రేట్లు ఉంటే వ‌ర్క‌వుట్‌ అవ్వదని అన్నారు. అయితే చిరంజీవి చేసిన ట్వీట్‌పై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు.

Prabhas : డిసెంబర్‌ నుంచి ‘ప్రాజెక్టు K’ చిత్రీకరణ.. జెట్‌స్పీడ్‌లో ప్రభాస్

చిరంజీవి అభిప్రాయం గురించి ఏపీ సీఎం జ‌గ‌న్‌తో చర్చిస్తామని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా టికెట్ ధరలు ఉండేలా చూస్తామని పేర్ని నాని అన్నారు. చిరంజీవితో పాటు పలువురు సీనియర్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు టికెట్ రేట్లు పెంచాలని కోరారని, అయితే ప్రస్తుతం సీఎం జగన్ అసెంబ్లీ హడావిడిలో ఉన్నారని, అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత జగన్ తో చర్చిస్తామన్నారు.