Star Heroins: పర్సనల్ స్టైలిస్ట్ ఫీవర్.. స్టార్ హీరోయిన్ల అందం వెనుకున్నది వాళ్ళే!

అతిలోక సుందరి శ్రీదేవి నటిస్తున్న రోజుల్లో పర్సనల్ స్టైలిస్ట్ కాన్సెప్ట్ లేదు. ట్రెండ్ మారింది ఆల్మోస్ట్ టాప్ సౌత్ ఇండియన్ హీరోయిన్స్ అందరికీ పర్సనల్ స్టయిలిస్ట్ ఉండాల్సిందే..

Star Heroins: పర్సనల్ స్టైలిస్ట్ ఫీవర్.. స్టార్ హీరోయిన్ల అందం వెనుకున్నది వాళ్ళే!

Star Heroins

Star Heroins: అతిలోక సుందరి శ్రీదేవి నటిస్తున్న రోజుల్లో పర్సనల్ స్టైలిస్ట్ కాన్సెప్ట్ లేదు. ట్రెండ్ మారింది ఆల్మోస్ట్ టాప్ సౌత్ ఇండియన్ హీరోయిన్స్ అందరికీ పర్సనల్ స్టయిలిస్ట్ ఉండాల్సిందే.. ఈ రోజుల్లో పర్సనల్ స్టయిలిస్ట్ కు సమంత నుంచి కీర్తి సురేష్ వరకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Star Heroins: హీరోలెందుకు.. ఆడియన్స్‌ని ధియేటర్లకు రప్పిస్తున్న హీరోయిన్లు

సమంత నుంచి కీర్తి సురేష్ వరకు పర్సనల్ స్టయిలిస్టులు లేకుండా అడుగు బయట పెట్టడం లేదు. ఆన్ స్క్రీన్ అప్పియరెన్సే కాదు, ఆఫ్ స్క్రీన్ లో హీరోయిన్స్ ఎలా కనిపిస్తున్నారో చూసి, అభిమానులు ఆదరిస్తున్నారు. దాంతో స్క్రీన్ మీదే కాదు, సోషల్ మీడియాలో కూడా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయడానికి రకరకాల కసరత్తులు చేస్తున్నారు ముద్దు గుమ్మలు. ట్రెండ్ కి తగినట్టు ఆడియన్స్ ఇంట్రెస్ట్ ను గ్రాబ్ చేయడానికి పర్సనల్ స్టయిలిస్టుల మీద ఆధారపడుతున్నారు స్టార్ హీరోయిన్స్.

Star Heroins: కలెక్షన్ క్వీన్స్.. మార్కెట్ సెట్ చేస్తున్న హీరోయిన్స్!

గతంలో సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఫాషన్ కే ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది శ్రీదేవి. ఆరోజుల్లో పర్సనల్ స్టయిలిస్ట్ లు లేకపోయినా సినిమాకి పనిచేసే స్టియిలిస్ట్ లే వారి స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యేలా, స్క్రీన్ ప్రజెన్స్ మీద దృష్టి పెట్టి హెయిర్ డ్రెస్సింగ్, కస్ట్యూమ్ డిజైనింగ్, మేకప్ చేస్తుండే వాళ్లు. ప్రజెంట్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయింది. దాంతో సౌత్ ఇండియా హీరోయిన్స్ కు పర్సనల్ స్టయిలిస్టులు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటున్నారు ఇప్పటి హీరోయిన్లు.

Star Heroins: స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌తో హీరోయిన్స్.. హీరోలతోనే పోటీ!

ప్రజెంట్ బ్రాండ్స్ కూడా సోషల్ మీడియా ఫాలోవర్స్ ను దృష్టిలో ఉంచుకునే బ్రాండ్ అంబాసిడర్స్ ను ఎంపిక చేసుకుంటున్నాయి. మోడ్రన్ డ్రెస్ లతో బోల్డ్ కాస్ట్యూమ్స్ తో ఆన్ స్క్రీన్ తో పాటు, ఆఫ్ స్క్రీన్ లో ఎట్రాక్ట్ చేయడం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్, సమంత, తమన్నాతో మొదలైనా… ఈ ఫీవర్ దాదాపు సౌత్ హీరోయిన్స్ అందరికీ అంటుకుంది. కీర్తి సురేష్ మాత్రం సారీస్, హాఫ్ సారీస్, సల్వార్స్ తో ఇప్పటికీ తన ప్రత్యేకతను చాటుతుంది. కాని, ఇప్పుడు అలా కాదు, గ్లోబల్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడానికి ట్రెండ్ని ఫాలో అవుతూ మేకోవర్ అవ్వాలి కాబట్టి.. బ్యూటిఫుల్ గా కనిపించాలంటే పర్సనల్ స్టైలిస్ట్ ల ని హైర్ చేసుకుంటున్నారు.