RRR : ‘ఆర్ఆర్ఆర్’ నిలిపివేయాలి అంటూ హైకోర్టులో పిల్

ఒకపక్క ఈ సినిమా వాయిదా పడిందని దేశమంతటా ప్రేక్షకులు బాధపడుతుంటే మరోపక్క సినిమా పై హైకోర్టులో పిల్ దాఖలైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య హైదరాబాద్.....

RRR : ‘ఆర్ఆర్ఆర్’ నిలిపివేయాలి అంటూ హైకోర్టులో పిల్

Rrr

RRR :  ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ని తెరకెక్కించారు రాజమౌళి. ఈ సినిమాపై దేశమంతటా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్స్ చుసిన తర్వాత ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. కరోనా వల్ల ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడిన ఈ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 7న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కాని ఈ సారి కూడా మళ్ళీ కరోనా దెబ్బ పడటంతో ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి వాయిదా పడింది. మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు, ప్రేక్షకులు.

అయితే ఒకపక్క ఈ సినిమా వాయిదా పడిందని దేశమంతటా ప్రేక్షకులు బాధపడుతుంటే మరోపక్క సినిమా పై హైకోర్టులో పిల్ దాఖలైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య హైదరాబాద్ హైకోర్టు లో పిల్ దాఖలు చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ చారిత్రక యోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటించారు. ఇందులో చారిత్రక యోధుల పాత్రలను రాజమౌళి వక్రీకరించి చిత్రీకరించారని ఆమె పిటిషన్ లో పేర్కొంది. మహనీయుల అసలు చరిత్ర కాకుండా కాల్పనిక కథతో సినిమా తెరకెక్కించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ సినిమాకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికేట్‌‌ను రద్దు చేయడంతో పాటు సినిమా విడుదలను నిలిపివేయాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అల్లూరి వంశానికి చెందిన సౌమ్య దాఖలు చేసింది.

Samantha : ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ మేకింగ్ వీడియో బయటపెట్టిన సమంత

కొమరం భీమ్, అల్లూరి వంటి యోధుల జీవితాలకు వ్యతిరేకంగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారని, ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి దగ్గర పోలీస్ అధికారిగా పనిచేయడాన్ని తప్పుపడుతూ ఈ పిల్ ని దాఖలు చేసింది. ఇందులో ప్రతివాదులుగా సెన్సార్ బోర్డ్, చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య, డైరెక్టర్ రాజమౌళి, రచయత విజయేంద్ర ప్రసాద్ లను చేర్చింది.

Balakrishna : బాలయ్య అన్ స్టాపబుల్ రికార్డ్.. ఐఎండిబి టాప్ 10 షోలలో స్థానం

అయితే ఈ విషయాన్నీ అభిమానులు, ప్రేక్షకులు సీరియస్ గా తీసుకొని ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. రాజమౌళి గతంలోనే చెప్పాడని ఇది కేవలం కట్టు కథ అని, కేవలం వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ క్యారెక్టర్స్ తో సొంతంగా రాసుకున్న కథ అని చెప్పారని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాక సినిమా మొదలై నాలుగు సంవత్సరాలైంది ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని, ఒకపక్క దేశం గర్వించే సినిమా తీస్తే మీరు మాత్రం ఇలా మనోభావాలు దెబ్బతిన్నాయి అని తెలుగు సినిమాని డీగ్రేడ్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరి దీనిపై హైకోర్టు, సినిమా బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.