Big Boss 5: అర్ధరాత్రి మానస్ దుప్పట్లో పింకీ.. బీబీ హౌస్‌లో మూడుముక్కలాట!

బీబీ ఇంట్లో ఐదు వారాలు పూర్తయి ఆరవ వారం నడుస్తుంది. గురువారం కెప్టెన్సీ టాస్క్ కూడా పూర్తి చేయగా విశ్వ ఈ వారం కెప్టెన్ గా ఎన్నికైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

10TV Telugu News

Big Boss 5: బీబీ ఇంట్లో ఐదు వారాలు పూర్తయి ఆరవ వారం నడుస్తుంది. గురువారం కెప్టెన్సీ టాస్క్ కూడా పూర్తి చేయగా విశ్వ ఈ వారం కెప్టెన్ గా ఎన్నికైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఎట్ట‌కేల‌కు బొమ్మ‌ల కొలువు టాస్క్ ముసిగింది. శ్వేతా, లోబో ఇంట్లో కుషన్స్ పాడుచేస్తున్నా అడ్డుకోవడంలో సంచాల‌కులైన కాజ‌ల్‌, సిరి అడ్డుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని పేర్కొంటూ బిగ్ బాస్ వారిని కెప్టెన్సీ కంటెండ‌ర్స్ టాస్క్‌లో అన‌ర్హులుగా ప్ర‌క‌టించారు. దీంతో కెప్టెన్‌ అయ్యే ఛాన్స్ పోయిందేన‌ని సిరి క‌న్నీరుపెట్టుకోగా ష‌ణ్ముఖ్ ఆమెను ఓదార్చగా.. కెప్టెన్సీకి పోటీప‌డేందుకు అర్హ‌త సాధించిన సంతోషంలో మాన‌స్ యానీ మాస్ట‌ర్‌ను ఎత్తుకుని తిప్పాడు.

Big Boss 5: లోబో పొట్టపై సెటైర్లు.. యానీ మాస్టర్ ఉగ్రరూపం!

ఇక, కాజల్ తాను ఎలాంటి రిలేషన్ పెట్టుకోకపోయినా ఇంట్లో ఎవరు ఎవరి మీద మనసు పడ్డారు.. ఎవరి మీద ఇంట్రెస్ట్ చుపిస్తున్నారనేది మాత్రం కూపీ లాగుతుంది. వాళ్ళని ఎంకరేజ్ కూడా చేస్తుంది. గురువారం కూడా కాజల్.. నీకు నీ మీదున్న ప్రేమ కంటే మాన‌స్ మీదే ఎక్కువ ప్రేమ ఉన్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని ప్రియాంక గురించి ఆమెతోనే చెప్పుకొచ్చింది. మాన‌స్ కోసం ఎక్కువ కేర్ తీసుకుంటున్న‌ట్లు అనిపిస్తోంద‌ని చెప్పింది. దీంతో ఆలోచ‌న‌లో ప‌డిన పింకీ.. మానస్ విష‌యంలో త‌ను చేస్తోంది త‌ప్పా అని అడిగింది. దానికి కాజ‌ల్ త‌ప్పేం కాద‌ని ఎంకరేజ్ చేసింది.

Big Boss 5: ఈ వారం నామినేషన్‌లో పదిమంది.. ఎలిమినేట్ అయ్యేది ఎవరో?

ఆ తర్వాత మానస్ డదగ్గరకి వెళ్లిన కాజ‌ల్‌.. నీ కోసం ముగ్గురు కొట్టుకుంటున్నార‌ని ముచ్చ‌ట్లు పెట్టింది. పింకీతోపాటు ప్రియ నీ విష‌యంలో పొజెసివ్ అనిపిస్తుంద‌ని చెప్పగా.. మూడో వ్య‌క్తి ఎవ‌ర‌న్న‌ది మాత్రం బ‌య‌ట‌పెట్ట‌లేదు. ఇక రాత్రిపూట మాన‌స్ గురించి మీటింగ్ పెట్టారు అమ్మాయిలు. అత‌డు బాగుంటాడ‌ని సిరి కామెంట్ చేయ‌గా ‘నీ దిష్టే త‌గులుతుందే, ఏం క‌ళ్లే అవి..’ అంటూ పింకీ చిర్రుబుర్రులాడింది. దీంతో మ‌రింత రెచ్చిపోయిన సిరి.. ఎంత క్యూట్ ఉన్నాడో అంటూ మాన‌స్‌కేసి చూడ‌గా వెంట‌నే పింకీ ఆమె చూపు తిప్పేస్తూ ప‌డుకోబెట్టింది.

Big Boss 5: ఫాఫం.. ఉన్న ఒక్క జంటను విడగొట్టేశారే!

ఇక, అర్ధ‌రాత్రి దుప్ప‌టి క‌ప్పుకుని ప‌డుకున్న మాన‌స్‌ దగ్గరకి వెళ్లిన పింకీ.. మానస్ దుప్పటి తీసి నుదుట‌న బొట్టు పెట్టేసింది. ఇది చూసి అక్క‌డున్న‌వాళ్లంతా షాకవుతూనే పింకీ మ‌న‌సులోని భావాల‌ను పాట‌ల రూపంలో బ‌య‌ట‌పెట్టారు. ఇక, ఈ వారం విశ్వ కెప్టెన్ గా అర్హత సాధించినట్లు తెలుస్తుండగా.. రేషన్ మేనేజర్ గా పింకీ అర్హత సాధించినట్లు తెలుస్తుంది. మానస్, సన్నీ సోసోగా టాస్క్ ఆడి పింకీని రేషన్ మేనేజెర్ కూడా గెలిచేలా చేసినట్లు కనిపించగా.. ఈ వారం ఎలిమినేషన్ లో పదిమంది నామినేట్ అయి ఉండగా ఇందులో ఎవరు ఇంటి నుండి బయటకి వెళ్తారన్నది ఆసక్తిగా మారింది.