పవన్ ఫ్యాన్స్ Vs నందమూరి ఫ్యాన్స్.. వర్మ రెచ్చగొట్టాడు.. చిచ్చుపెట్టాడు..

  • Published By: sekhar ,Published On : July 22, 2020 / 08:11 PM IST
పవన్ ఫ్యాన్స్ Vs నందమూరి ఫ్యాన్స్.. వర్మ రెచ్చగొట్టాడు.. చిచ్చుపెట్టాడు..

RGV అంటే రోజూ గిల్లే వాడు అన్నట్టుగా ‘పవర్‌స్టార్’ సినిమాతో గతకొద్ది రోజులుగా ఆయన పవన్ అభిమానులను కవ్విస్తూనే ఉన్నాడు. ఇక బుధవారం ట్రైలర్ రిలీజ్ చేయడంతో పవన్ అభిమానుల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే వర్మ మీద ‘పరాన్నజీవి’, ‘డేరాబాబా’(దీరాబాబా) వంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లు అనౌన్స్ చేసి పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు పీకే అభిమానులు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ పవర్‌స్టార్ వివాదం కాస్తా పవన్ ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్‌గా కొత్త టర్న్ తీసుకుంది.
సోషల్ మీడియాలో హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధాలు ఏ స్థాయిలో జరుగుతాయో తెలిసిందే. అందులోనూ మెగా, నందమూరి అభిమానుల గురించి అయితే చెప్పక్కర్లేదు.

Lakshmi's NTR

గతంలో వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’(అమ్మరాజ్యంలో కడప బిడ్డలు) తీసినప్పుడు మెగాభిమానులు ఆ సినిమాలకు సపోర్ట్ చేస్తూ నందమూరి ఫ్యాన్స్‌ను ఆటాడుకున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్స్ తీస్తే నాగబాబు తీవ్ర విమర్శలు చేశాడు. ఆ సినిమాల ఫలితం ఏంటనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘పవర్‌స్టార్’ సినిమా విషయానికొస్తే నందమూరి ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే టైంగా భావిస్తున్నారు. అంతేకాదు తమ వాళ్లపై తీసిన రెండు సినిమాల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పోస్టులు, మీమ్స్ చేసిన కొన్ని సోషల్ మీడియా పేజీలపై బహిరంగంగానే ట్వీట్లు వేస్తున్నారు. అప్పుడు మా మీద సినిమా తీసిన వాడే ఇప్పుడు మీ మీద తీసింది.. ఇప్పుడు బాగుందా మీకు అంటూ నందమూరి ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతున్నారు. అప్పుడు ఆర్జీవీని సపోర్ట్ చేసి ఇప్పుడు మీ హీరో మీద సినిమా తీశాడని విమర్శిస్తున్నారా.. మీ వరకు వస్తే కానీ తెలియలేదా నొప్పి అంటూ ఎన్ ఫ్యాన్స్ పీకే ఫ్యాన్స్‌ను కవ్విస్తున్నారు. ఈ ఫ్యాన్ వార్ కాస్త ముదిరి ఎక్కడికి చేరుతుందో మరి. మొత్తానికి ఇరు హీరోల అభిమానుల మధ్య చిచ్చు పెట్టి వర్మ వేడుక చూస్తున్నాడన్న మాట..
Amma Rajyam Lo Kadapa Biddal