Malty starrer Movies: వచ్చేస్తున్న టాప్ స్టార్ మల్టీస్టారర్ కాంబినేషన్స్!

ఒక్క హీరో ఉంటేనే బడ్జెట్, కలెక్షన్లు, క్రేజ్, హైప్స్, ఎక్స్ పెక్టేషన్స్ అన్నీ ఓ రేంజ్ లో ఉంటున్నాయి. అలాంటిది ఇద్దరు టాప్ హీరోలు కలిసి సినిమాలు చేస్తే..

Malty starrer Movies: వచ్చేస్తున్న టాప్ స్టార్ మల్టీస్టారర్ కాంబినేషన్స్!

Malty Starrer Movies

Malty starrer Movies: ఒక్క హీరో ఉంటేనే బడ్జెట్, కలెక్షన్లు, క్రేజ్, హైప్స్, ఎక్స్ పెక్టేషన్స్ అన్నీ ఓ రేంజ్ లో ఉంటున్నాయి. అలాంటిది ఇద్దరు టాప్ హీరోలు కలిసి సినిమాలు చేస్తే.. అది వేరే లెవల్ లో ఉంటుందనడంలో ఏమాత్రం డౌట్ లేదు. లేటెస్ట్ గా టాలీవుడ్ లో ఇద్దరు హీరోలు లీడ్ రోల్స్ లో టాప్ స్టార్ కాంబినేషన్స్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మరి ఏ హీరో కాంబినేషన్ కి ఎక్కువ క్రేజ్ ఉందో , ఏ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ హైగా ఉన్నాయో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

Tollywood Malty-starers: క్రేజీ మల్టీస్టారర్స్.. ఒకే టికెట్‌పై డబుల్ బోనాంజా!

టాలీవుడ్ లో ఎప్పుడూ లేనన్ని స్టార్ స్టడెడ్ మూవీస్ తెరకెక్కుతున్నాయి. స్పెషల్లీ టాప్ స్టార్ కాంబినేషన్స్ ఉంటే ఆ కిక్కే వేరు. ప్రజెంట్ తెలుగు సినిమా ఆడియన్స్ కి అలాంటి కిక్ ఫుల్ గా దొరకబోతోంది. ఇద్దరు స్టార్లు లీడ్ రోల్స్ లో పోటీ పోటీగా స్క్రీన్ మీద కనిపిస్తే.. ఆ సినిమాల మీద ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. అలాంటి క్రేజీ కాంబినేషనే మెగాస్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఏదో అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా వెళ్లిపోయే క్యారెక్టర్లో కనిపిస్తేనే చొక్కాలు చించుకునే ఫాన్స్.. ఈ ఇద్దరు లీడ్ రోల్స్ లో పోటీపడుతుంటే.. చూడాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.

NBK108: బర్త్ డే రోజున ఫ్యాన్స్ కు బాలయ్య రోరింగ్ ట్రీట్!

సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్ గా లేకపోయినా.. కొన్ని కొన్ని కాంబినేషన్స్ ని చూస్తేనే పండగ చేసుకుంటారు ఫ్యాన్స్. అలాంటి టాప్ కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి, చరణ్. ఈ తండ్రీ కొడుకులిద్దరూ జస్ట్ అలా ఒక్కసీన్ లోనే కనిపిస్తేనే తెగ సంబరపడిపోయే ఫ్యాన్స్.. ఇద్దరూ కలిసి సినిమాలో మేజర్ రోల్ ప్లే చేస్తే ఆ కాంబినేషన్ సూపర్ హిట్టే. అలాంటి స్టార్ కాంబినేషన్ ని సెట్ చేశారు కొరటాల. చిరంజీవి హీరోగా చేస్తున్న ఆచార్య సినిమాలో చరణ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి చేసిన పాటలు రిలీజ్ చేస్తేనే పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్ కి ఏప్రిల్ 29న రిలీజ్ అవుతున్న ఆచార్య ఫుల్ మూవీ చూస్తే పూనకాలే అంటున్నారు జనాలు.

NBK107: కన్నడ మఫ్టీకి రీమేక్ ప్రచారం.. అసలు నిజమేంటి?

చిరంజీవితో ఏ స్టార్ లీడ్ రోల్ చేసినా అది ఇంట్రస్టింగ్ గానే ఉంటుంది. స్పెషల్లీ చిరంజీవిని బాగా ఎడ్మైర్ చేసే రవితేజ లాంటి హీరోలు.. తాను ప్రేమగా పిలిచే అన్నయ్యతో స్క్రీన్ షేర్ చేస్కుంటే చూడడం ఆడియన్స్ కి కూడా పండగే. ఇప్పుడు అలాంటి కాంబినేషనే త్వరలో తెరమీద చూడబోతున్నాం. చిరంజీవి, బాబీ కాంబినేషన్లో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న వాల్తేరు వీరన్న సినిమాలో రవితేజ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పటికే చిరంజీవి నటించిన 2,3 సినిమాల్లో రవితేజ అప్పుడప్పుడు వచ్చి మెరిపించారు కూడా.

Tollywood Celebrations: ఇట్స్ పార్టీ టైమ్.. సెలబ్రేషన్ మూడ్‌లో టాలీవుడ్!

టాలీవుడ్ లో మరో ఇంట్రస్టింగ్ లీడ్ పెయిర్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ అంటే పవన్ కి ఫస్ట్ నుంచి ప్రత్యేకమైన అభిమానం. అందుకే రిపబ్లిక్ మూవీ టైమ్ లో సాయికి యాక్సిడెంట్ అయితే.. సినిమా ప్రమోషన్ మొత్తం పవన్ కళ్యాణే చేశారు. ఇప్పుడు ఆ అభిమానం తెరకెక్కబోతోంది. పవన్ కళ్యాణ్ సముద్రఖని డైరెక్షన్లో చెయ్యబోతున్న తమిళ్ మూవీ వినోదయుమ్ సీతమ్ రీమేక్ లో సాయిధరమ్ తేజ్ మెయిన్ లీడ్ ప్లే చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.

Tollywood Big Movies: ఎంత తోప్ సినిమా అయినా.. లెక్కలు తేల్చేది ప్రేక్షకులే!

పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ సోలోగా సినిమాలు చేసినా.. మొన్నీమద్య రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన భీమ్లానాయక్ మాత్రం ఇద్దరులీడ్ హీరోల సరికొత్త ట్రెండ్ కి తెరతీసింది. పవన్ కళ్యాణ్, రానా లీడ్ రోల్స్ లో సాగర్ చంద్ర డైరెక్షన్లో రిలీజ్ అయిన భీమ్లానాయక్ లో ఇద్దరు హీరోల్ని పోటాపోటీగా చూపించారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న కాప్ గా పవన్ కళ్యాణ్ నిచూపిస్తే.. అసలు ఏమాత్రం తగ్గని పొగరున్న క్యారెక్టర్ లో రానాని అంతే ఈక్వల్ స్పేస్ తో కన్విన్సింగ్ గా చూపించి ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు.

Tollywood Directors: స్టార్స్‌తో సినిమాలు చేసినా.. పట్టాలెక్కని నెక్స్ట్ ప్రాజెక్ట్స్!

ఇద్దరు హీరోలు లీడ్ రోల్స్ చేస్తున్న మరో సినిమా ఎఫ్ 3. వెంకటేష్, వరుణ్ తేజ్ లీడ్ రోల్స్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఎఫ్ 2 ఫ్రాంచైజ్ లో వస్తున్న మరో సినిమా ఎఫ్ 3. ఈ ఫన్ ఫిల్డ్ ఎంటర్ టైనర్ లో సీనియర్ హీరో వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్.. పోటీపడి మరీ నటిస్తున్నారు. ఇద్దరు లీడ్ రోల్స్ లో కంప్లీట్ స్క్రీన్ ని ఆక్యుపై చేశారు వరుణ్, వెంకటేష్. ఈ కామెడీ ఎంటర్ టైనర్ మే 27న ధియేటర్లోకొస్తోంది.

Tollywood Senior Heroes: ఏజ్ సిక్స్ టీ ప్లస్.. కానీ కుర్ర హీరోలతోనే పోటీ!

జనరల్ గా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమాలో పనిచెయ్యాలంటే.. క్యారెక్టర్స్ వైజ్ ఇద్దరికీ సేమ్ ఇంపార్టెన్స్, స్పేస్ ఉండాలి. అది ఏమాత్రం అటూ ఇటైనా.. కతవేరే రూట్లోకి వెళ్తుంది. అందుకే అలాంటి రిస్క్ చెయ్యడానికి పెద్దగా ఇష్టపడరు మేకర్స్. కానీ రాజమౌళి మాత్రం ఎన్టీఆర్, చరణ్ లాంటి టాప్ స్టార్ కాంబినేషన్ ని సెట్ చేసి ట్రిపుల్ ఆర్ సినిమా చేశారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ క్యారెక్టర్స్ ని పవర్ ఫుల్ గా తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నారు.