Anchor Rashmi : మంత్రి కేటీఆర్ సహాయం కోరిన యాంకర్ రష్మి!

బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్న రష్మి...ఓ విషయంలో మంత్రి కేటీఆర్ సహాయం కోరారు. ట్విట్టర్ వేదికగా..కేటీఆర్ కార్యాలయ ఖాతాతో పాటు..కేటీఆర్ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేస్తూ..ఓ ట్వీట్ చేశారు. యాంకర్ రష్మి..చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Anchor Rashmi : మంత్రి కేటీఆర్ సహాయం కోరిన యాంకర్ రష్మి!

Rashmi

Anchor Rashmi And Minister KTR: బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్న రష్మి…ఓ విషయంలో మంత్రి కేటీఆర్ సహాయం కోరారు. ట్విట్టర్ వేదికగా..కేటీఆర్ కార్యాలయ ఖాతాతో పాటు..కేటీఆర్ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేస్తూ..ఓ ట్వీట్ చేశారు. యాంకర్ రష్మి..చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోల్లో…రష్మి పాల్గొంటున్నారు. తన యాంకరింగ్ తో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఈమె..సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొంటారు.

Read More : Man Harassing Woman : ఆమెను అక్కడ తాకుతూ ఆకతాయి వెర్రిచేష్టలు.. దిమ్మతిరిగేలా అతడికి బుద్ధిచెప్పింది!

తనకు సంబంధించిన విషయాలు, తదితర విషయాలపై ఆమె పోస్టులు చేస్తుంటారు. ఈమె…జంతు ప్రేమికురాలు. మూగ జీవాలకు ఏదైనా హానీ జరిగితే..వెంటనే స్పందిస్తుంటారు. కరోనా వైరస్ సమయంలో లాక్ డౌన్ విధించినప్పుడు వీధి కుక్కలు, పావురాల కోసం ప్రతిరోజు ఆహారం అందించే వారు. జంతు పరిరక్షణ కోసం ఆమె ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Read More : Posani Krishna Murali: పోసానికి కరోనా పాజిటివ్..!

జంతువుల విషయంలో…మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కలకు ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) ఆపరేషన్ చేసి అలాగే వదిలేస్తున్నారు…ఏదైనా పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆమె మంత్రి కేటీఆర్ ను కోరారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్ పై యాంకర్ రష్మి స్పందించారు. హైదరాబాద్ లో వీధి కుక్కల సంతతి తగ్గించేందుకు వైద్య సిబ్బంది ఆపరేషన్ చేసి అలాగే వదిలేస్తున్నారని వెల్లడిస్తూ…‘సేవ్ యానిమల్స్ ఇండియా’ అనే ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ యూజర్ కొంతకాలంగా…పోస్టూ చేస్తూ వస్తున్నారు. ఆపరేషన్ తర్వాత..చేయాల్సిన చికిత్స చేయకుండానే రోడ్లపైనే విడిచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read More : Covid Children Health : పిల్లల మానసిక ఆరోగ్యంపై కోవిడ్ ప్రభావం.. తల్లిదండ్రులు వారికి ఎలా సహాయపడగలరు

శునకాలకు సంబంధించి ఫొటోల వివరాలతో సహా.. ఇలా దాదాపు 2 వేల 122 కుక్కలకు ఆపరేషన్ చేసి ఇలాగే నిర్ధాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేశారని ట్వీట్ లో తెలిపారు ఆ వ్యక్తి. తమకు విధించిన రోజువారీ టార్గెట్ ను చేరుకోవడం కోసం వైద్య సిబ్బంది ఇలా నోరులేని జీవాలను హింసించడం సరికాదంటున్నారు పలువురు నెటిజన్లు. మరి…ఈ విషయంలో యాంకర్ రష్మి..చేసిన ట్వీట్ తో మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.