Modi :కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఇండియాకి ‘గౌరవ సభ్యదేశం’ హోదా.. ఇక్కడికొచ్చి సినిమాలు తీయండి.. విదేశీ నిర్మాతలకు మోదీ ఆహ్వానం..
ప్రఖ్యాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భారత దేశానికి ‘గౌరవ సభ్య దేశం’ హోదా దక్కడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ తన సందేశాన్ని ఓ లేఖ ద్వారా..............

Cannes Filim Festival : ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరుగుతున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మన సినిమాలని కొన్ని ప్రదర్శించనున్నారు. మన దేశానికి చెందిన పలువురు నటులు కూడా ఈ ఫెస్టివల్ లో పాల్గొననున్నారు. అంతే కాక కాన్స్ చిత్రోత్సవాల్లో ఇండియాకి ‘గౌరవ సభ్య దేశం’ హోదాని ఇచ్చారు. దీంతో కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ కూడా ఈ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ప్రఖ్యాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భారత దేశానికి ఈ హోదా దక్కడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ తన సందేశాన్ని ఓ లేఖ ద్వారా తెలిపారు.
ఈ లేఖలో భారతీయ సినిమా గొప్పతనం, ఇక్కడ సినిమాల చిత్రీకరణకు ఎంత అనుకూలంగా ఉంటుందో తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలను భారతదేశం నిర్మిస్తుందని, ఘనమైన సాంస్కృతిక వారసత్వ సంపద ఈ దేశ బలం అని, బయటి దేశాల నిర్మాతలకు కూడా ఇక్కడి చిత్ర నిర్మాణ రంగంలో సులభతర వాణిజ్య విధానాన్ని అమలు పరుస్తున్నామని, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, ప్రకృతి అందాలు ఉన్న భారతదేశం ప్రపంచ దర్శక నిర్మాతలకు నచ్చుతుందని తెలుపుతూ భారతదేశానికి వచ్చి సినిమాలు తీయండి అంటూ ఆహ్వానం పంపారు.
ఇక సత్యజిత్ రే శత జయంతి ఉత్సవాల సందర్భంగా కాన్స్ క్లాసిక్ చిత్ర ప్రదర్శనలో సత్యజిత్ రే సినిమాలను ప్రదర్శించడం పట్ల మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దర్శక, నిర్మాతలు భారతదేశంలో సినిమాలు నిర్మించే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ లేఖ ద్వారా మోదీ కోరారు. దీంతో ఈ లేఖ ట్విట్టర్లో పలువురు షేర్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఫెస్టివల్ లో పాల్గొన్న ఫొటోలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
“India🇮🇳has a lot of stories to be told and the country truly possesses immense potential to become the content hub of the world.”
– PM @narendramodi Ji’s message as India gets set to participate as the first ‘Country of Honour’ at Marche Du Films @Festival_Cannes pic.twitter.com/Op2ZsjB6O6
— Anurag Thakur (@ianuragthakur) May 17, 2022
A historic moment as India 🇮🇳 the 1st ‘Country of Honour’ at Marche Du Films @Festival_Cannes gets set to manifest into the ‘content hub of the world and the preferred ‘post production hub’ for global film makers. pic.twitter.com/GNHm1jWIiB
— Anurag Thakur (@ianuragthakur) May 17, 2022
- PM Modi: కళా ప్రేమికుల కోసం అందుబాటులోకి ప్రగతి మైదాన్ టన్నెల్
- Supreme Court : గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు
- PM Modi: “2024 ఎన్నికల తర్వాత దేశంలో రాష్ట్రాల సంఖ్య 50కు పెరుగుతాయ్”
- PM Modi Tweet : ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వంపై ప్రధాని మోదీ ట్వీట్
- Movie Shootings : వివాదం ముగిసినట్టేనా? ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ ప్రెస్ మీట్..
1Andhra pradesh : మహిళా వార్డెన్ పై చేయ్యేత్తిన ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి
2Floor Test: బలపరీక్షకు సిద్ధమవుతున్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు
3AB Venkateswara Rao: జగన్, ఆమెకు ఒక న్యాయం.. నాకు ఒక న్యాయమా? మళ్లీ కోర్టుకు వెళ్తా
4Maharashtra political crisis : పతనం అంచున ఉద్ధవ్ ప్రభుత్వం..‘మహా’ రాజకీయాల భీష్మాచార్యుడు శరద్ పవార్ తక్షణ కర్తవ్యం ఏంటీ?
5Fine To BJP: డిజిటల్ బోర్డు… బీజేపీకి జీహెచ్ఎంసీ ఫైన్
6Movies : లైగర్ వచ్చేదాకా మార్కెట్ అంతా మీడియం, చిన్న సినిమాలదే..
7Maharashtra political crisis: క్లైమాక్స్‌కు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం..ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పతనానికి కారణం స్వయంకృతాపరాధమేనా?
8Kotha Prabhakar Reddy: పేదల భూములు ఆక్రమించిన ఈటల: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
9Krithi Shetty : కలర్‌ఫుల్ డ్రెస్‌తో కృతిశెట్టి..
10Bihar : బీహార్‌లో పిడుగుపాటుకు మరో 16 మంది దుర్మరణం
-
Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి