Modi biopic : 9 అవతారాల్లో వివేక్

  • Published By: madhu ,Published On : March 18, 2019 / 11:50 AM IST
Modi biopic : 9 అవతారాల్లో వివేక్

ఏప్రిల్ 11, ఏప్రిల్ 12.. ఈ తేదీలపై ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 11 తేదీన ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక ఏప్రిల్ 12 వ తేదీ ఓ సినిమా రిలీజ్ కాబోతోంది. దీనిపై కాషాయ నేతలు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ సినిమానే ‘మోడీ బయోపిక్’. ఒక వ్యక్తి ప్రధాన మంత్రి స్థాయికి ఎలా ఎదిగారు ? ఏయే వయస్సుల్లో ఏం చేశారు ? తదితర విషయాలను వెండితెరపై చూపించబోతున్నారు. ఈ సినిమాను ఒమంగ్ కుమార్ డైరెక్షన్‌లో రూపొందుతోంది. 
Read Also : అనిల్ అంబానీ జైలుకేనా! : ఎరిక్సన్ కేసులో ఒక్కరోజే గడువు

ఏ సిినిమా ఇండస్ట్రీలో చూసినా బయోపిక్‌‌ల చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సక్సెస్ అవుతుండగా మరికొన్ని డిజాస్టర్‌గా మిగులుతున్నాయి. వ్యాపార, క్రీడా, సినిమా రంగానికి చెందిన ప్రముఖుల జీవితాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. తెలుగులో మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు సినీ నేపథ్యంలో వస్తే..ఎన్టీఆర్ మహానాయకుడు, యాత్ర లాంటి సినిమాలు రాజకీయ నేపథ్యంలో వచ్చాయి. వర్మ దర్శకత్వంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం షూటింగ్ జరుపుకొంటోంది. త్వరలోనే రిలీజ్ కాబోతోంది ఈ సినిమా. 

బాలీవుడ్‌లో కూడా రాజకీయ నేపథ్యంతో సినిమాలు రూపొందుతున్నాయి. అందులో ప్రధానమైంది..పీఎం నరేంద్ర మోడీ బయోపిక్ చిత్రం రూపొందుతోంది. ఒమంగ్ కుమార్ దీనిని తెరకెక్కిస్తున్నారు. సందీప్ ఎస్ సింగ్ సంగీతం అందిస్తున్నారు. మోడీ పాత్రలో ‘వివేక్ ఒబరాయ్’ పోషిస్తున్నారు. ఈ సినిమాలో 9 విభిన్న అవతరాల్లో కనిపించనున్నాడు. స్వయంగా ఈ విషయాన్ని సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఏప్రిల్ 12న రిలీజ్ కానుంది. 

దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల నేపథ్యంలో రాజకీయంతో రూపొందిన సినిమాను ఎలా రిలీజ్ చేస్తారని ప్రశ్నిస్తోంది. సినిమా రిలీజ్ అయితే ఓటర్లపై ప్రభావం చూపే చాన్స్ ఉందంటోంది. మరి ఈ సినిమా అదే తేదీన రిలీజ్ అవుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

Read Also : అరుదైన వ్యాధి అంట : ముషార్రఫ్ ఆరోగ్యం విషమం