పిఎమ్ నరేంద్రమోదీ ట్రైలర్ మాయం

యూట్యూబ్‌లో కనిపించని మోదీ ట్రైలర్..

  • Published By: sekhar ,Published On : April 16, 2019 / 12:24 PM IST
పిఎమ్ నరేంద్రమోదీ ట్రైలర్ మాయం

యూట్యూబ్‌లో కనిపించని మోదీ ట్రైలర్..

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా ఒక సినిమా తెరకెక్కబోతుంది. పిఎమ్ నరేంద్రమోదీ పేరుతో రూపొందబోయే నరేంద్రమోదీ బయోపిక్‌లో, ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, నరేంద్ర మోదీగా నటిస్తున్నాడు. ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా, సురేష్ ఒబెరాయ్, సందీప్ ఎస్‌సింగ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇదిలా ఉంటే, మోదీ : ది జర్నీ ఆఫ్ ఎ కామన్ మెన్ పేరుతో బాలీవుడ్‌లో ఒక వెబ్ సిరీస్ రూపొందుతుంది. ఉమేష్ శుక్లా డైరెక్ట్ చేసాడు. త్వరలో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్‌లో కనబడక పోవడం చర్చనీయాంశమైంది. మోదీ : ది జర్నీ ఆఫ్ ఎ కామన్ మెన్ పేరుతో సెర్చ్ చేస్తుంటే, ట్రైలర్ కనిపించడం లేదు..

Pm Narendra Modi

ఏంటా.. అని ఆరాతీస్తే పర్మిషన్ లేకుండా స్ట్రీమింగ్ చేస్తున్నారని ఢిల్లీ పోలీసులు తొలగించారని, ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి బయోపిక్‌లు ప్రదర్శించకూడదని ఎలక్షన్ కమీషన్ నోటీసులు ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. గతంలోనూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోపిక్, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో ఇలాగే మాయమైన సంగతి తెలిసిందే..