చాయ్‌వాలా టూ పీఎం: ట్రైలర్ చూశారా?

చాయ్‌వాలా టూ పీఎం: ట్రైలర్ చూశారా?

చాయ్‌వాలా టూ పీఎం: ట్రైలర్ చూశారా?

సినిమా రంగంలో ఇప్పుడు బయోపిక్‌ల సీజన్ నడుస్తుంది. ఈ క్రమంలో వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో నరేంద్ర మోడీ బయోపిక్‌ను ఒమంగ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా చీత్రయూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది.  ‘పీఎం నరేంద్ర మోడీ’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ బయోపిక్.. ట్రైలర్ చూస్తుంటే రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ఫుల్ యాక్షన్ సినిమాలా అనిపిస్తుంది.
Read Also : జేడీని చూడగానే జగన్ కు దడ.. వైసీపీ కబ్జాల నుంచి ఆయన కాపలా : పవన్

తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తుంటే.. సినిమాలో నరేంద్ర మోడీ ఛాయ్ అమ్మే స్థాయి నుంచి ఆర్ఆర్ఎస్‌లో జాయిన్ అయ్యి  ప్రధానిగా ఎలా ఎదిగాడు అనే క్రమాన్ని కథగా మలిచి తెరకెక్కించినట్లు అర్థం అవుతుంది. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా మోడీ ఉద్యమంలో పాల్గొనడం హైలెట్‌ చేసినట్లు కనిపిస్తుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గోద్రా అల్లర్లు, అక్షర్ ధామ్ ఆలయంపై ఉగ్రవాదుల దాడులు వంటివి ట్రైలర్‌‌లో కనిపించాయి.
​​​​​​​Read Also : పోసానికి ఈసీ నోటీసులు.. ఆసుపత్రిలో చేరానంటూ లేఖ ​​​​​​​

ప్రధాని అయ్యాక ఉరి, పఠాన్ కోట్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను కూడా ఇందులో హైలెట్ చేసినట్లు కనిపిస్తుంది. ఈ సినిమాను సందీప్ సింగ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. తొలుత సినిమాను ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్రయూనిట్.. నిర్మాణంతర కార్యక్రమాలు ముందే కావడంతో ముందే సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.

ఈ సినిమాను దేశంలోని అన్నీ బాషలలోను విడుదల చేయనున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగుతున్న వేళ సినిమా విడుదల అవుతుందా? అనేది అనుమానమే.
Read Also : ఓట‌ర్ నుంచి తొలి లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

×