PM Modi : తెలుగు సినిమాని పొగడ్తలతో ముంచేసిన పీఎం నరేంద్రమోదీ

తెలుగు సినిమాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ''తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించింది. తెలుగు సినీ పరిశ్రమ అతి పెద్ద..

PM Modi :  తెలుగు సినిమాని పొగడ్తలతో ముంచేసిన పీఎం నరేంద్రమోదీ

Telugu Cinema

 

Telugu Cinema :  తాజాగా తెలంగాణ ముచ్చింతల్లో అతిపెద్ద రామానుజ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ప్రధాని మోదీ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమాని పొగడ్తలతో ముంచేశారు. ఇటీవల కాలంలో తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి ఎదగడం, ఎక్కువ విజయాలు సాధించడం, కలెక్షన్స్ కూడా భారీగా సాధించడం, మన తెలుగు సినిమాలు బాలీవుడ్ లో జెండా ఎగరేయడంతో తెలుగు సినిమా కీర్తి దేశమంతటా వ్యాపిస్తుంది. ఇలాంటి సమయంలో మోదీ మన తెలుగు సినిమా పై మాట్లాడటంతో దేశమంతా తెలుగు సినిమాలపై మరింత ఆసక్తి పెరిగింది.

తెలుగు సినిమాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ”తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించింది. తెలుగు సినీ పరిశ్రమ అతి పెద్ద పరిశ్రమగా రూపొందింది. తెలుగు సినిమా సిల్వర్‌ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తోంది. సిల్కర్‌ స్కీన్‌ నుంచి ఓటీటీ వరకు తెలుగు సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తెలుగు భాష చరిత్ర ఎంతో సుసంపన్నమైంది.” అంటూ తెలుగు సినీ పరిశ్రమని మెచ్చుకున్నారు పీఎం నరేంద్రమోదీ.

Anasuya : బిజెపి నేత నిర్మాణంలో సునీల్, అనసూయ మెయిన్ లీడ్స్‌గా సినిమా

దీంతో ఈ వ్యాఖ్యలు అటు సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్ లోను ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. పలువురు సినీ ప్రముఖులు నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలని షేర్ చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నారు.