కరోనాతో పాటల రచయిత అనీల్ కన్నుమూత

కరోనాతో పాటల రచయిత అనీల్ కన్నుమూత

Anil Panachooran:కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులను కోల్పోగా.. ఇప్పుడు ప్రముఖ మళయాళ పాటల రచయిత అనీల్ పనాచూరన్(55) కన్నుమూశారు. కరోనాతో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనీల్ ఆదివారం రాత్రి మరణించారు. అనారోగ్యంతో బాధపడుతున్న అనీల్.. తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా.. ఆదివారం(03 జనవరి 2021) రాత్రి 8.30 గంటల సమయంలో గుండెపోటుతో చనిపోయారు.

అనీల్‌ రాసిన అరబ్బీ కథ, కథ పరయుంబోల్, మాడంబి, మేరిక్కుందోరు కుంజాడు, వెలిపాండింటే పాటలు ఎంతో పాపులర్‌ అయ్యాయి. వృతిరీత్యా లాయర్‌ అయిన అనీల్..‌ సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అరబిక్కధతో గేయ రచయితగా ప్రస్థానం ప్రారంభించారు. అనీల్ రాసిన పాటలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. ఈరన్ మేఘమే మరియు చోరా వీణా మన్నిల్ వంటి పాటలు ఇండ‌స్ట్రీ బిగ్‌ హిట్‌గా నిలిచాయి.

అతి తక్కువ కాలంలోనే 220కి పైగా పాటలు రాసిన అనీల్.. కొన్ని మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. అనీల్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా అనిల్‌ మృతిని జీర్ణించుకోలేక పోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థించారు.