Police Case : వివాహితపై వేధింపులు.. సినీ కెమెరామెన్ పై పోలీస్ కేసు నమోదు..

సినీ పరిశ్రమకి చెందిన కూనపరెడ్డి శ్రీనివాస్ కెమెరామెన్ గా, యాడ్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. యూసుఫ్‌గూడ సమీపంలోని నవోదయ కాలనీలో శ్రీనివాస్‌ నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ ఉండే ఇంటికి ఎదురుగా ఓ వివాహిత తన భర్త, పిల్లలతో కలిసి ఉంటుంది. ఎదురెదురు................

Police Case : వివాహితపై వేధింపులు.. సినీ కెమెరామెన్ పై పోలీస్ కేసు నమోదు..

Police case against cameraman for misbehaving with a woman

Police Case :  సినీ పరిశ్రమకి చెందిన కూనపరెడ్డి శ్రీనివాస్ కెమెరామెన్ గా, యాడ్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. యూసుఫ్‌గూడ సమీపంలోని నవోదయ కాలనీలో శ్రీనివాస్‌ నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ ఉండే ఇంటికి ఎదురుగా ఓ వివాహిత తన భర్త, పిల్లలతో కలిసి ఉంటుంది. ఎదురెదురు ఇళ్ళులు కావడంతో శ్రీనివాస్ తో ఆ కుటుంబానికి సాధారణ పరిచయం ఉంది. అయితే గత కొన్నినెలలుగా ఆ వివాహితని శ్రీనివాస్ తీవ్రంగా వేధిస్తున్నాడు.

Prabhakar : వీడి యాటిట్యూడ్ ఏంట్రా.. స్టార్ నటుడి తనయుడిపై ట్రోల్స్.. మంచిదేగా అంటున్న నటుడు

ఆమె ఇంటిముందు నిలబడి శ్రీనివాస్‌ గట్టిగా కేకలు వేయ­డం, ఆ మహిళ గురించి చెడుగా మాట్లాడటం చేస్తున్నాడు. మొదట తాగిన మత్తులో అలా చేస్తున్నాడు అనుకోని వివాహిత భర్త, చుట్టుపక్కల వాళ్ళు పలుసార్లు హెచ్చరించారు. అయినా మారకుండా మరింత వేధించడం మొదలుపెట్టాడు. నాతో ఉండిపో, నా దగరికి వచ్చేయ్ అంటూ ఆ మహిళ ఇంటిముందు నిలబడి అరవడం, వాళ్ళ ఇంటి ముందే కూర్చోవడం లాంటివి చేయడం, బెదిరించడం కూడా చేయడంతో విసిగిపోయిన ఆ మహిళ పోలీసులకి కంప్లైంట్ చేసింది. బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడు కూనపరెడ్డి శ్రీనివాస్‌పై వేధింపులు, క్రిమినల్ సెక్షన్స్ పై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.