AR Rahman : స్టేజి మీద పాడుతుండగానే AR రెహమాన్ ప్రోగ్రాంని ఆపేసిన పోలీసులు..

AR రెహమాన్ పాట పాడుతుండగానే పోలీసులు(Police) వచ్చి ప్రోగ్రాంని ఆపేసి వెళ్లిపొమ్మని చెప్పారు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.

AR Rahman : స్టేజి మీద పాడుతుండగానే AR రెహమాన్ ప్రోగ్రాంని ఆపేసిన పోలీసులు..

Police stopped AR Rahman performance on stage in pune

AR Rahman :  తాజాగా AR రెహమాన్(AR Rahmna) పుణేలో(Pune) ఓ ప్రైవేట్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఓ ఈవెంట్ లో AR రెహమాన్ ప్రోగ్రాం చేసేందుకు ఒప్పుకున్నాడు. దీంతో నిన్న మే 1న పుణేలో AR రెహమాన్ ప్రోగ్రామ్ చేసి పాటలు(Songs) పాడి అలరించాడు. అయితే AR రెహమాన్ పాట పాడుతుండగానే పోలీసులు(Police) వచ్చి ప్రోగ్రాంని ఆపేసి వెళ్లిపొమ్మని చెప్పారు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.

పుణేలో రాత్రి 10 దాటినా తర్వాత బహిరంగ ప్రదర్శనలు నిషేధం ఉన్నాయి ప్రస్తుతం. ఈ నేపథ్యంలో ఈవెంట్ నిర్వాహకులకు 10 గంటల వరకే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు. కానీ నిర్వాహకులు 10.15 అయినా కూడా ఇంకా ప్రోగ్రాంని నడుపుతుండటంతో పోలీసులు ఓ పక్కన AR రెహమాన్ పాట పాడుతుండగానే స్టేజి మీదకు వెళ్లి ప్రోగ్రాంని ఆపించారు. ఈవెంట్ నిర్వాహకులను వెంటనే ఖాళీ చేయాలని పోలీసులు తెలిపారు. దీంతో ఆ ఈవెంట్ కు వచ్చిన అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తూ తిరిగి వెళ్లిపోయారు.

దీనిపై పలువురు అభిమానులు విమర్శలు చేయగా పూణే జోన్ 2 DCP స్మార్తన్ పాటిల్ మాట్లాడుతూ.. 10 గంటల తర్వాత ఎలాంటి ప్రోగ్రామ్స్ జరగకూడదని నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈవెంట్ నిర్వాహకులు కూడా 10 వరకే పర్మిషన్ తీసుకున్నారు. మా పోలీసులు అప్పటికే ఇంకో పావుగంట వెయిట్ చేశారు. 10.15 అయినా కుడా ప్రోగ్రాం ఆపకపోవడంతో మా పోలీసులు స్టేజి మీదకు వెళ్లారు అని తెలిపారు.

Anil Sunkara : ఈ రోజుల్లో ఇలా సినిమా ఫెయిల్ అయింది అని ఒప్పుకునే ప్రొడ్యూసర్స్ ఎంతమంది?

అయితే ఇలా AR రెహమాన్ పాట పాడుతుండగానే పోలీసులు వచ్చి ఆపించడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. పూణే పోలీసులకు వ్యతిరేకంగా, AR రెహమాన్ కి సపోర్ట్ గా పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు. ఇక AR రెహమాన్ ఈ ప్రోగ్రాంపై పుణేలో ప్రోగ్రాం బాగా జరిగింది. ఇందుకు సహకరించిన వారికి, ప్రోగ్రాంకి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. త్వరలో మళ్ళీ పాడటానికి మీ ముందుకు వస్తాను అని ట్వీట్ చేశారు.