Anchor Ravi : యాంకర్ రవి ఇంటికి పోలీసులు.. “తప్పు మాట్లాడాలంటే భయం పుట్టాలి”

నెట్టింట్లో తనపై, తన కుటుంబ సభ్యులపై కొందరు పనికట్టుకొని మరి విమర్శలు చేస్తున్నారని.. యాంకర్ రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Anchor Ravi : యాంకర్ రవి ఇంటికి పోలీసులు.. “తప్పు మాట్లాడాలంటే భయం పుట్టాలి”

Anchor Ravi

Anchor Ravi : సోషల్ మీడియాలో సెలెబ్రిటీలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఏదైనా తప్పు చేసినా.. లేదంటే సినిమా నచ్చకపోయిన ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. తాజాగా యాంకర్ రవిని టార్గెట్ గా చేసుకొని కొందరు సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో దూషించారు. అతడిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. కొందరు తెగించి రవి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. నెటిజన్ల ట్రోల్స్‌తో విసిగిపోయిన రవి పోలీసులను ఆశ్రయించారు. తనపై, తన కుటుంబంపై కొందరు పనికట్టుకొని విమర్శలు చేస్తున్నారని, సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కొందరు నెటిజన్లు చేసిన కామెంట్ స్క్రీన్ షాట్స్ ను తన ఫిర్యాదుకు జత చేశారు.

చదవండి : Anchor Ravi : ట్రోల్ చేసే వారిపై పోలీసులకి ఫిర్యాదు చేసిన యాంకర్ రవి

తనను, తన కుటుంబ సభ్యులను ట్రోల్ చేస్తున్నారని రవి సోషల్ మీడియాలో చెప్పాడు. తనపై బ్యాడ్‌ కామెంట్స్‌ పెట్టేవాళ్లను హెచ్చరించాడు. తన పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్న వారి వివరాలను సేకరించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసిన రవి.. ఈ సారి ఏకంగా పోలీసులను తన ఇంటికి పిలిపించుకొని ఆధారాలు, స్క్రీన్‌ షాట్స్‌ అందించాడు. ఇందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు రవి.

“మీరు చేయాలనుకున్నది మీరు చేయండి.. నేను చేయాల్సింది చేస్తా. కానీ ఒకరికి ఒక నెగిటివ్ కామెంట్, రిప్లై పెట్టే ముందు 30 సెకన్లు ఆలోచించండి. ఇక సోషల్ మీడియాలో చెత్తను క్లీన్ చేద్ధాం. పాజిటివిటీని స్ప్రెడ్ చేద్దాం” అని పోస్ట్ పెట్టాడు రవి.

మరో పోస్టులో స్పందించిన రవి…”ఎండ్ కోసం స్టార్ట్! ఇన్‌స్టా/ఫేస్ బుక్/ట్విట్టర్, యూట్యూబ్ రివ్యూవర్స్ లో ఎవరైతే ఇతరులను డీఫేమ్ చేస్తున్నారో.. తప్పుడు, అబద్ధపు సమాచారం ప్రచారం చేస్తున్నారో.. తప్పుడు భాష/పదజాలంతో వ్యతిరేకిస్తున్నారో వాళ్లపై సైబర్ క్రైమ్ సైబరాబాద్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాను. వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. తప్పుడు మాట మాట్లాడాలి అంటే భయం పుట్టాలి ఇప్పటినుంచి..” అని రాసుకొచ్చారు రవి.

చదవండి : Anchor Ravi: ఆ రూ.45 లక్షలు.. మోసపోయిన రవికి అదే బాధ!

 

View this post on Instagram

 

A post shared by Anchor Ravi (@anchorravi_offl)