Polimera 2: ‘పొలిమేర-2’ పోస్టర్ లాంచ్ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

స‌త్యం రాజేష్‌, డా.కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకేందు మౌళి, అక్ష‌త‌, బాలాదిత్య‌, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను తదితరులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ‘మా ఊరి పొలిమేర-2’ ఫస్ట్ లుక్ ను మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ లాంచ్ చేశారు.

Polimera 2: ‘పొలిమేర-2’ పోస్టర్ లాంచ్ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Polimera 2 Movie Poster Launched By Talasani Srinivas Yadav

Polimera 2: శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై గౌరికృష్ణ నిర్మాత‌గా డా.అనిల్ విశ్వ‌నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ‘మా ఊరి పొలిమేర-2’ తెరకెక్కుతోంది. స‌త్యం రాజేష్‌, డా.కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకేందు మౌళి, అక్ష‌త‌, బాలాదిత్య‌, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను తదితరులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ లాంచ్ చేశారు.

Rakul Preet Singh: గడ్డ కట్టే చలిలో రకుల్ ప్రీత్ సింగ్ ఏం చేసిందో తెలుసా..?

ఈ సంద‌ర్భంగా మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ.. ‘‘మా ఊరి పొలిమేర-2 పోస్ట‌ర్ చాలా బాగుంది. ఈ చిత్రానికి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ నా శుభాకాంక్ష‌లు’’ అన్నారు. ఇక నటుడు స‌త్యం రాజేశ్ మాట్లాడుతూ.. ‘‘గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ‘మా ఊరి పొలిమేర’ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆద‌రించారు. దానికి సీక్వెల్‌గా వ‌స్తున్న ‘మా ఊరి పొలిమేర-2’ త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాం. ద‌ర్శ‌కుడు సీక్వెల్ ని అద్భుతంగా తెర‌కెక్కించారు.’’ అని అన్నారు.

నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ.. ‘‘మా ఊరి పొలిమేర-2 చిత్రం ఫ‌స్ట్ లుక్ లాంఛ్ చేసిన మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ గారికి కృత‌జ్ఞ‌త‌లు. ‘మా ఊరి పొలిమేర’ చిత్రాన్ని చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. దానికి సీక్వెల్‌గా వ‌స్తున్న ‘మా ఊరి పొలిమేర-2’ చిత్రం మా బ్యాన‌ర్‌లో చేస్తున్నందుకు ద‌ర్శ‌కుడు డా.అనిల్ విశ్వ‌నాథ్ కి మ‌రియు న‌టీన‌టులంద‌రికీ ధ‌న్య‌వాదాలు. అంద‌రం ఒక ఫ్యామిలీలాగా ఈ చిత్రాన్ని కంప్లీట్ చేశాం. ద‌ర్శకుడు ‘మా ఊరి పొలిమేర’ను మించి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే టీజ‌ర్ కూడా రిలీజ్ చేస్తాం’’ అని అన్నారు.

ఈ సీక్వెల్ మూవీని డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు డా.అనిల్ విశ్వ‌నాథ్ మాట్లాడుతూ.. ‘మా ఊరి పొలిమేర-2’ ఫ‌స్ట్‌లుక్ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ విడుద‌ల చేయ‌డం చాలా పాజిటివ్‌గా అనిపించింది. ఇది ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతున్నా. ‘మా ఊరి పొలిమేర’ చిత్రాన్ని ప్రేక్ష‌కులంద‌రూ బాగా ఆద‌రించారు. ‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి సిక్వెల్ ఉందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. ఈ ప్ర‌శ్న‌కి స‌మాధానంగా ‘మా ఊరి పొలిమేర-2’ ఫ‌స్ట్ లుక్ లాంఛ్ చేయ‌డం జ‌రిగింది. ఈ చిత్రం విడుద‌ల తేదీల‌ను త్వ‌ర‌లోనే నిర్మాత గౌరికృష్ణ వెల్ల‌డిస్తారు‘ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం గ్యాని అందిస్తుండగా ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.