Sarath Babu : శరత్ బాబు మరణం పై మోదీ, జగన్, చంద్రబాబు సంతాపం..

శరత్ బాబు మరణానికి చింతిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే నరేంద్ర మోదీ, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు..

Sarath Babu : శరత్ బాబు మరణం పై మోదీ, జగన్, చంద్రబాబు సంతాపం..

political leaders Modi Jagan Chandrababu condolence on sarath babu demise

Sarath Babu : గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు.. ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ (AIG) ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఐసీయూలో చికిత్స పొందుతూ వస్తున్న శరత్ బాబు.. మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ తో నేడు (మే 22) కన్ను మూశారు. ఆయన మరణ వార్త తెలియడంతో సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు నరేంద్ర మోదీ (Narendra Modi) వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), చంద్రబాబు నాయుడు (N Chandrababu Naidu) సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేశారు.

Sarath Babu : శరత్ బాబు మరణం పై సెలబ్రేటిస్ సంతాపం.. ఫ్రెండ్‌ని కోల్పాయాము అంటున్న కమల్, రజినీ!

ప్రధాన మంత్రి మోదీ..

విలక్షణ నటుడు శ్రీ శరత్ బాబు కన్నుమూయడం బాధాకరం. పలు భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన ఆయన ఎప్పటికి గుర్తిండిపోతారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

సీఎం జగన్..

తెలుగు చలనచిత్ర రంగంలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గొప్ప నటుడు శరత్‌బాబుగారు. నేడు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం బాధాకరం. శరత్‌బాబు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

Chiranjeevi – Pawan Kalyan : శరత్ బాబుకి చిరంజీవి, పవన్ కళ్యాణ్ నివాళులు.. వెండితెర జమిందార్ శరత్ బాబు!

చంద్రబాబు నాయుడు..

ప్రముఖ సీనియర్ సినీ నటులు శరత్ బాబుగారి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించింది. వివిధ భాషాచిత్రాల్లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి దక్షిణాది సినీ పేక్షకులను మెప్పించిన శరత్ బాబు గారి మృతి సినీరంగానికి తీరని లోటు. ఆయన ఆత్మశాంతికై ప్రార్థిస్తూ, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

Balakrishna : శరత్ బాబుకి బాలకృష్ణ నివాళులు.. ఆయనతో కలసి పని చేయడం!

మంత్రి రోజా..

మీతో గడిపిన ప్రతిక్షణం ఓ జ్ఞాపకం, మీరు లేరని నమ్మలేకపోతున్నాను, సహనటులుగా నా తండ్రి పాత్రలో మీరు తండ్రిని తలపించారు, మీరు లేరని మీ అభిమాన పిలుపు ఇక వినపడదని తలచుకుంటే జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది, మీ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నా.