Poonam Pandey : పూనమ్ పాండేను తీవ్రంగా కొట్టిన భర్త.. హాస్పిటల్లో పూనమ్

సామ్ పూన‌మ్ జుట్టు ప‌ట్టుకొని త‌ల‌ను గోడ‌కేసి కొట్టాడ‌ట‌. పూనమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండ‌గా, పూన‌మ్ ఫిర్యాదు మేరకు ఆమె భ‌ర్త‌ను బాంద్రా పోలీసులు అరెస్ట్ చేశారు.

Poonam Pandey : పూనమ్ పాండేను తీవ్రంగా కొట్టిన భర్త.. హాస్పిటల్లో పూనమ్

Poonam

Poonam Pandey :  పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన బోల్డ్ స్టేట్మెంట్స్ తో, బోల్డ్ ఫోటోలు, వీడియోలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. బాలీవుడ్ లోనే కాక దేశం మొత్తం పూనమ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పూనమ్ తన హాట్ హాట్ ఫొటోలతో, వీడియోలతో అభిమానులను, సోషల్ మీడియాలో ఫాలోయర్స్ ని పెంచుకుంటుంది.

Lara Dutta : డేటింగ్‌ యాప్‌లో మాజీ మిస్‌ యూనివర్స్‌ ప్రోఫైల్‌

2020 సెప్టెంబర్ 10న పూనమ్ సామ్ బాంబేను ప్రేమ వివాహం చేసుకున్నారు. చాలా కాలంగా రిలేషన్ లో ఉన్న ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. సామ్ బాంబే కి అంతకు ముందే వివాహం జరిగింది. ఆ తర్వాత విడాకులు కూడా జరిగాయి. పూనమ్ ని రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లి త‌ర్వాత ఈ జంట హ‌నీమూన్‌కి గోవా వెళ్లారు. ఆ స‌మ‌యంలో తనను శారీరకంగా, లైంగికంగా వేధించాడంటూ సామ్ బాంబే పై కేసు పెట్టారు పూన‌మ్. దీంతో గోవా పోలీసులు సామ్ బాంబేను అరెస్ట్ చేశారు. తర్వాత కాంప్రమైజ్ కావడంతో మళ్ళీ వీరిద్దరూ కలిసి ఉంటున్నారు.

Puneeth Rajkumar : పునీత్‌ పేరుతో ఉచిత ఆస్పత్రి, పాఠశాల : గాలి జనార్దనరెడ్డి

తాజాగా పూన‌మ్ మరోసారి సామ్ బాంబేపై ముంబై పోలీసులకి ఫిర్యాదు చేసింది. సామ్‌బాంబే తన మొదటి భార్య అల్విరాతో మళ్ళీ మాట్లాడుతూ, సంబంధం పెట్టుకుంటున్నాడు అంటూ పూన‌మ్ అతనితో గొడ‌వ‌ప‌డింద‌ట‌. దీంతో సామ్ పూన‌మ్ జుట్టు ప‌ట్టుకొని త‌ల‌ను గోడ‌కేసి కొట్టాడ‌ట‌. దీంతో పూనమ్‌ తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పూనమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండ‌గా, పూన‌మ్ ఫిర్యాదు మేరకు ఆమె భ‌ర్త‌ను బాంద్రా పోలీసులు అరెస్ట్ చేశారు.

Bigg Boss 5: బిగ్ బాస్ నుంచి జెస్సి అవుట్.. షాక్ లో షన్ను, సిరి

ఈ ఘ‌ట‌న‌పై తాజాగా మీడియాతో మాట్లాడిన పూన‌మ్ .. ఇది మొదటి సారి జరిగింది కాదు. ప్రతిసారి సామ్‌ నన్ను కొట్టడం, ఆ తర్వాత ఏడుస్తూ క్షమాపణలు చెప్పడంతో నేను కరిగిపోయేదాన్ని. ఈసారి మాత్రం నన్ను దారుణంగా కొట్టాడు. ఈ దెబ్బల వల్ల నేను ఎన్ని రోజులు ఆసుప‌త్రిలో ఉండాలో తెలియట్లేదు. అందుకే ఈ సారి సామ్ పై మళ్ళీ ఫిర్యాదు చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు వెనక్కి తీసుకోను అంటూ తెలిపింది.