Upasana : చిరంజీవి చెప్పారని ఉపాసన ఫోన్ చేశారు.. షాక్ అయ్యానంటున్న పొన్నంబలం!

చిరంజీవికి ఫోన్ చేసి తన ఆరోగ్య పరిస్థితి చెప్పిన కొద్దిసేపటికే ఉపాసన ఫోన్ చేసి పొన్నంబలంని షాక్ కి గురి చేసిందట. మావయ్య మీ గురించి చెప్పారని..

Upasana : చిరంజీవి చెప్పారని ఉపాసన ఫోన్ చేశారు.. షాక్ అయ్యానంటున్న పొన్నంబలం!

Ponnambalam shares phone call with chiranjeevi and upasana

Ponnambalam : టాలీవుడ్ ఆడియన్స్ కి విలన్ గా పరిచయమైన తమిళ నటుడు ‘పొన్నంబలం’. స్టంట్ మ్యాన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన పొన్నంబలం.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ విలన్ గా ఎదిగాడు. తెలుగులోకి చిరంజీవి ఘరానా మొగుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత చిరుతో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో కూడా వర్క్ చేశాడు. అయితే కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్న పొన్నంబలంకి చిరంజీవి సహాయం చేశాడు అన్న విషయం ఇటీవల ఒక తమిళ మీడియా ద్వారా చాలా లేటుగా వెలుగులోకి వచ్చింది.

Ram Charan : హాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్‌ని.. ఇండియా రావాలని కండిషన్ పెడతా.. రామ్‌చరణ్!

తాజాగా ఈ నటుడు ఒక తెలుగు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆ మొత్తం విషయాన్ని టాలీవుడ్ ఆడియన్స్ కి తెలియజేశాడు. “కిడ్నీలు పాడైపోయి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డాను. శరత్ కుమార్, ధనుష్ వంటి హీరోలు కొంత డబ్బు ఇచ్చి సహాయం చేసినప్పటికీ.. పూర్తి ఆరోగ్యంగా మారడానికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకోవాల్సి వచ్చింది. అలంటి పరిస్థితిలో చిరంజీవి గుర్తుకు వచ్చి ఆయనకి కాల్ చేశాను. ఆయన ఏదో కొంత డబ్బు ఇచ్చి సహాయం చేస్తారు అనుకున్నాను. కానీ నా పరిస్థితి విన్న ఆయన వెంటనే నా అకౌంట్ కి కొంత డబ్బుని పంపించారు. నన్ను వెంటనే దగ్గరలో ఉన్న అపోలో హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పారు” అని చెప్పుకొచ్చాడు.

Bholaa Shankar : స్విట్జర్లాండ్‌లో తమన్నాతో చిరు డ్యూయెట్.. విడుదల వరకు చిరు లీక్స్ ఫిక్స్ అంటున్న మెగాస్టార్!

ఇక చిరంజీవి ఫోన్ పెట్టేసిన కొద్దిసేపటికే పొన్నంబలంకి మరో ఫోన్ కాల్ వచ్చిందట. ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయగా.. “నేను రామ్ చరణ్ వైఫ్ ఉపాసనని. మావయ్య మీ గురించి చెప్పారు. మీరు వెంటనే చెన్నైలోని అపోలో హాస్పిటల్ కి వెళ్ళండి” అని ఉపాసన ఫోన్ చేసి చెప్పారట. ఆమె నుంచి ఫోన్ కాల్ రావడంతో పొన్నంబలం షాక్ అయ్యినట్లు చెప్పుకొచ్చాడు. కాగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తో కలిపి హాస్పిటల్ మొత్తం ఖర్చు 58 లక్షలు పైగా అయ్యిందట. ఆ మొత్తాన్ని చిరంజీవి కట్టినట్లు తెలియజేశాడు.