Ponniyin Selvan 2 : 300 కోట్లకు పొన్నియిన్ సెల్వన్ 2 కలెక్షన్స్.. ఇది సరిపోదు అంటున్న సినీ వర్గాలు..

PS2 సినిమా మొదటి రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. కానీ ఆ తర్వాత కలెక్షన్స్ మెల్లిగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పటివరకు పది రోజుల్లో పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.

Ponniyin Selvan 2 : 300 కోట్లకు పొన్నియిన్ సెల్వన్ 2 కలెక్షన్స్.. ఇది సరిపోదు అంటున్న సినీ వర్గాలు..

Ponniyin Selvan 2 collects 300 crores gross collections

Ponniyin Selvan 2 :  మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభిత, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య లక్ష్మి, ప్రభు, జయరాం.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) పార్ట్ 2 ఏప్రిల్ 28న పాన్ ఇండియా(Pan India) రిలీజయింది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 పర్వాలేదనిపించింది. ఈ సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

 

పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో PS2 కూడా ఇదే రేంజ్ లో కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ 2 ప్రపంచవ్యాప్తంగా 170 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అంటే దాదాపు 180 కోట్ల షేర్ కలెక్షన్స్ చేస్తే కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టు. PS2 సినిమా మొదటి రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. కానీ ఆ తర్వాత కలెక్షన్స్ మెల్లిగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పటివరకు పది రోజుల్లో పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. అంటే దాదాపు 150 కోట్ల షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.

Ponniyin Selvan 2 : పార్ట్ 1 తో పోలిస్తే ఇదే బెటర్ అంట.. పొన్నియిన్ సెల్వన్ 2 ట్విట్టర్ రివ్యూ..

ఇక పొన్నియిన్ సెల్వన్ 2 హిట్ అని చెప్పాలన్నా, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలన్నా దాదాపు ఇంకా 30 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించాలి. అంటే ఈ సినిమా కూడా ఓవరాల్ గా దాదాపు 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇన్ని రోజులకి 300 కోట్లు వచ్చింది. ఇంకో 100 కోట్లు ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే వస్తాయని చిత్రయూనిట్ ధీమాతో ఉంది. అయితే PS2 ని బాహుబలి రేంజ్ లో తమిళ్ వాళ్ళు ఊహించుకున్నా ఆ రేంజ్ కలెక్షన్స్ మాత్రం రావట్లేదు. మరి పొన్నియిన్ సెల్వన్ 2 ఓవరాల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.