Ponniyin Selvan 2 : పార్ట్ 1 తో పోలిస్తే ఇదే బెటర్ అంట.. పొన్నియిన్ సెల్వన్ 2 ట్విట్టర్ రివ్యూ..

తమిళ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ప్రకటించి తాజాగా నేడు ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 థియేటర్స్ లో పాన్ ఇండియా రిలీజ్ చేశారు.

Ponniyin Selvan 2 : పార్ట్ 1 తో పోలిస్తే ఇదే బెటర్ అంట.. పొన్నియిన్ సెల్వన్ 2 ట్విట్టర్ రివ్యూ..

Ponniyin Selvan 2 Movie Twitter Review

Ponniyin Selvan 2 :   తమిళ్(Tamil) నుంచి గత సంవత్సరం మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) సినిమా రిలీజయింది. ఈ సినిమాని భారీగా పాన్ ఇండియా రిలీజ్ చేశారు. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభిత, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య లక్ష్మి, ప్రభు, జయరాం.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ తో తెరకెక్కింది ఈ సినిమా. అయితే పొన్నియిన్ సెల్వన్ తమిళ్ లో భారీ విజయం సాధించినప్పటికీ మిగిలిన చోట్ల మాత్రం అంతగా విజయం సాధించలేదు.

తమిళ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ప్రకటించి తాజాగా నేడు ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 థియేటర్స్ లో పాన్ ఇండియా రిలీజ్ చేశారు. పొన్నియిన్ సెల్వన్ 1 కు తమిళ్ లో తప్ప మిగిలిన చోట్ల ఆదరణ దక్కలేదు. దీంతో మిగిలిన రాష్ట్రాల్లో పార్ట్ 2కు అసలు హైప్ కూడా లేదు. ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో తమిళనాడులో పొన్నియిన్ సెల్వన్ 2 షోలు పడ్డాయి. తమిళ్ వాళ్ళు సినిమా సూపర్ హిట్ అంటున్నా, ఓవర్సీస్ టాక్స్ మాత్రం పార్ట్ 1 కంటే కాస్త పర్వాలేదు అంటున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో పార్ట్ 1 కొంచెం అయినా ఆడిందంటే అది కార్తీ వల్లే. ఇప్పుడు పార్ట్ 2 కూడా కార్తీ క్యారెక్టర్ వల్లే ఆడుతుంది అని అంటున్నారు.