Vikram : విక్రమ్‌కి షూటింగ్స్‌లో పదేపదే ప్రమాదాలు.. ఆ యాక్సిడెంట్ మాత్రం ఒక పీడకల.. ఏమైందో తెలుసా?

షూటింగ్ సెట్స్ లో చియాన్ విక్రమ్ కి పదేపదే యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటున్నాయి. అయితే ఆ యాక్సిడెంట్ మాత్రం ఒక పీడకల అంటూ విక్రమ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో..

Vikram : విక్రమ్‌కి షూటింగ్స్‌లో పదేపదే ప్రమాదాలు.. ఆ యాక్సిడెంట్ మాత్రం ఒక పీడకల.. ఏమైందో తెలుసా?

Ponniyin Selvan 2 star Vikram met an accident at Thangalaan sets

Vikram : తమిళ స్టార్ హీరో విక్రమ్ ఇటీవలే పొన్నియిన్ సెల్వన్ 2(Ponniyin Selvan 2) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఆ మూవీ ప్రమోషన్స్ కూడా దాదాపు పూర్తి అవ్వడంతో విక్రమ్.. నిన్ననే (మే 2) తన కొత్త సినిమా తంగలాన్ (Thangalaan) సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈరోజు ఉదయం విక్రమ్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం జరిగి విక్రమ్ కు పక్కటెముక విరిగింది. విక్రమ్ ని వెంటనే హాస్పిటల్ కి తరలించగా ఆపరేషన్ చేయాల్సి వస్తుందని వైద్యులు తెలిపినట్లు విక్రమ్ మేనేజర్ మీడియాకు తెలియజేశాడు.

Vikram : తంగలాన్ షూటింగ్ లో ప్రమాదం.. విక్రమ్ కు విరిగిన పక్కటెముక.. హాస్పిటల్ కు తరలింపు

అయితే విక్రమ్ కి ఇలా యాక్సిడెంట్స్ అయ్యి ఆపరేషన్స్ అవ్వడం మొదటిసారి కాదు. గతంలో కూడా పలు షూటింగ్స్ టైంలో ప్రమాదాలు జరిగాయి. ఇక చిన్నతనంలో జరిగిన ఒక యాక్సిడెంట్ మాత్రం తన లైఫ్ లో ఎప్పటికి మర్చిపోలేని ఒక పీడకల అని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో విక్రమ్ చెప్పుకొచ్చాడు. తనకి 12 ఏళ్ల వయసులో ఫ్రెండ్ తో కలిసి బైక్ పై వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యి శరీరంపై ఎన్నో గాయాలు, పలు చోట్ల ఎముకలు విరగడం జరిగింది. ఆ ప్రమాదంలో తన కుడి కాలికి తీవ్ర గాయం లిగమెంట్లు దెబ్బ తిన్నాయి.

Thangalaan : వామ్మో ఇదెక్కడి ట్రాన్స్ఫర్మేషన్ రా బాబు.. తంగలాన్ మేకింగ్ వీడియో రిలీజ్.. విక్రమ్ ని చూసి భయపడుతున్న ప్రేక్షకులు..

ఎన్ని రోజులు ట్రీట్‌మెంట్ తీసుకున్నా గాయం మాత్రం తగ్గకపోవడంతో డాక్టర్.. విక్రమ్ తల్లికి కాలిని తీసేస్తే మంచిదని సలహా ఇచ్చాడట. అయితే విక్రమ్ మాత్రం తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా పోరాడి దాదాపు 23 సర్జరీలు చేయించుకొని, మూడేళ్ల పాటు వీల్‌ ఛైర్‌ లోనే ఉండి, ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకుని బయట పడినట్లు చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పుడు తంగలాన్ సెట్స్ జరిగిన యాక్సిడెంట్ కి వైద్యులు చికిత్స మొదలు పెట్టారు. విక్రమ్ పూర్తిగా కోలుకున్న తరువాతే తంగలాన్ షూటింగ్ లో పాల్గొంటాడని విక్రమ్ మేనేజర్ తెలియజేశాడు.