Green India Challenge : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పూజా హెగ్డే

బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్‌లను నామినేట్ చేసిన పూజా హెగ్డే..

10TV Telugu News

Green India Challenge: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. సినీ ప్రముఖులందరూ ఎంతో ప్రేమతో మొక్కలు నాటుతూ, తమ ఆత్మీయులను కూడా మొక్కలు నాటమని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ పూజూ హెగ్డే కూడా ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు.

Republic : టీమ్‌తో సినిమా చూసిన సాయి ధరమ్ తేజ్

తనతో ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలో నటించిన యువ నటుడు సుశాంత్ నుంచి ఈ ఛాలెంజ్ స్వీకరించిన పూజా మొక్కలు నాటి.. బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్‌లను కూడా మూడేసి మొక్కల చొప్పున నాటవలసిందిగా నామినేట్ చేశారు.

Flashback Movie : రెజీనా, అనసూయలతో ప్రభుదేవా ‘ఫ్లాష్ బ్యాక్’..

ఈ సందర్భంగా పూజా మాట్లాడుతూ.. ‘రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ గారు పచ్చదనాన్ని కాపాడడం కోసం చాలా చక్కని ఛాలెంజ్‌ను చేపట్టారు. ఆ స్ఫూర్తితోనే నేను మొక్కలు నాటాను. ఈ ఛాలెంజ్‌‌కు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్‌లను నామినేట్ చేస్తున్నాను’.. అన్నారు.

RRR Movie : సోల్ ఆంథమ్ ‘జనని’ వచ్చేసింది..