Pooja Hegde: బుట్టబొమ్మతో నాగార్జున సరికొత్త యాడ్.. సమ్మర్ కోసం స్పెషల్ యాడ్ రెడీ..

కింగ్ నాగార్జున, బుట్టబొమ్మ పూజాహెగ్డే ఎవరికివాళ్లు ఇప్పటివరకు చాలా యాడ్స్ చేశారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఒక యాడ్ చేశారు. అదే కూల్ డ్రింక్ మజా యాడ్. త్వరలో సమ్మర్ రాబోతుండటంతో తమ కూల్ డ్రింక్ సేల్స్ ని పెంచుకోవడానికి మజా కూల్ డ్రింక్ ఓ సరికొత యాడ్ ని.....................

Pooja Hegde: బుట్టబొమ్మతో నాగార్జున సరికొత్త యాడ్.. సమ్మర్ కోసం స్పెషల్ యాడ్ రెడీ..

Pooja Hegde:  మన సెలబ్రిటీలు సినిమాలతోనే కాకుండా బిజినెస్ లు, యాడ్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్.. ఇలా రకరకాలుగా డబ్బుని సంపాదిస్తున్నారు. చాలా మంది స్టార్లు ఫేమ్ ఉన్నప్పుడే డబులు సంపాదించే మార్గాలు వెతుక్కుంటారు. ఇక యాడ్స్ అయితే ఒకటి, రెండు రోజులువర్క్ చేసినందుకే చాలా రెమ్యునరేషన్ తీసుకుంటారు. దీంతో చాలా మంది స్టార్లు యాడ్స్ చేయడానికి ఆసక్తి చూపుతారు,

కింగ్ నాగార్జున, బుట్టబొమ్మ పూజాహెగ్డే ఎవరికివాళ్లు ఇప్పటివరకు చాలా యాడ్స్ చేశారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఒక యాడ్ చేశారు. అదే కూల్ డ్రింక్ మజా యాడ్. త్వరలో సమ్మర్ రాబోతుండటంతో తమ కూల్ డ్రింక్ సేల్స్ ని పెంచుకోవడానికి మజా కూల్ డ్రింక్ ఓ సరికొత యాడ్ ని నాగార్జున, పూజ హెగ్డేలతో తెరకెక్కించారు.

ఈ యాడ్ లో నాగార్జున, పూజ హెగ్డే ఓ పార్క్ లో నడుస్తూ వెళ్తుంటే నాగార్జున మజా తాగుతూ ఉంటాడు. పూజా అక్కడ పార్కులో ఉన్న బెంచీల మీద ఎవరు డొనేట్ చేసారో వాళ్ళ పేర్లు చదువుతూ ఉండగా ఒక బెంచి మీద మామిడి పండు అని రాసి ఉంటుంది. అప్పుడు మామిడిపండు ఎవరు అని పూజా హెగ్దే అడగటంతో మామిడిపండు అంటే మజానే కదా అని నాగ్ చెప్తాడు. మామిడిపండు లాంటి మంచితనం పేరు చెప్పకుండానే సాధ్యం. మజా అంటేనే మంచితనం అంటూ యాడ్ ని క్రియేట్ చేశారు.

Samantha : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి సారీ చెప్పిన సమంత..

నాగ్ తనయులు నాగ చైతన్య, అఖిల్ తో కలిసి సినిమాల్లో నటించిన పూజా ఇపుడు నాగ్ తో యాడ్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అంతకు ముందే గతంలో పూజా హెగ్డే మజా కూల్ డ్రింక్ కి అమితాబ్ తో కలిసి యాడ్ చేసింది. నాగార్జున ఈ వీడియోని అధికారికంగా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.