Pooja Hegde : తిరుగులేని బుట్టబొమ్మ.. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుస అవకాశాలు..

 సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసపెట్టి అవకాశాలు బుట్టబొమ్మను వెతుక్కుంటూ వస్తున్నాయి. కంటెంట్ తో నాకేంటి పని అన్నట్టు స్టార్స్ సరసన............

Pooja Hegde : తిరుగులేని బుట్టబొమ్మ.. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుస అవకాశాలు..

Pooja

Pooja Hegde :  సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసపెట్టి అవకాశాలు బుట్టబొమ్మను వెతుక్కుంటూ వస్తున్నాయి. కంటెంట్ తో నాకేంటి పని అన్నట్టు స్టార్స్ సరసన ఛాన్స్ లు కొట్టేస్తోంది. సౌత్ లో టాప్ ఫేజ్ ఎంజాయ్ చేస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అనిపించుకుంటోంది పూజా హెగ్డే. ఈ ఇయర్ ఏ హీరోయిన్ ఇవ్వనన్ని రిలీజ్ లు టాలీవుడ్ లో ఇచ్చినా 2022లో పూజాకి కలిసొచ్చిన సినిమా ఒక్కటీ లేదు.

ఎన్నో అంచనాలతో వచ్చిన ప్రభాస్ రాధేశ్యామ్ పట్టుమని పది రోజులు కూడా ఆడలేదు. కోలీవుడ్ లో మాత్రమే పర్వాలేదనిపించిన బీస్ట్ మరే లాంగ్వేజ్ లోనూ పూజాకి క్రేజ్ తీసుకురాలేదు. చిరూ- చరణ్ కలిసొచ్చిన ఆచార్య కూడా పూజా ఫ్లాప్ లిస్ట్ లోనే చేరిపోయింది. అయినా సరే బుట్టబొమ్మ లైనప్ చూసి షాకవుతున్నారు మిగతా హీరోయిన్స్. పూజాకి పోటీ ఇచ్చే హీరోయిన్ ఎవరా అని చర్చించుకుంటున్నారు. ఇక్కడ పూజాను ఎదుర్కునే హీరోయిన్స్ లో ముందు వరసలో ఉంది రష్మిక. అయితే రష్మిక నటించిన పుష్ప భారీ విజయం అందుకున్నా కూడా పూజా హెగ్డేకి వచ్చినన్ని ఆఫర్స్ టాలీవుడ్ లో రష్మిక కు రాలేదు. పుష్ప తర్వాత ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా వచ్చి రష్మిక క్రేజ్ ను కాస్త తగ్గించిందనే చెప్పాలి.

వినయ విధేయ రామ, భరత్ అనే నేను, తర్వాత ఇప్పుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ మూవీ చేస్తన్న కియారా అద్వానీ అయినా సౌత్ లో స్టార్ హీరోయిన్ అవతుందనుకుంటే, రెండు మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకుంటే గాని, ఒక సినిమా చేయడంలేదు. సమంత హీరోలతో సంబంధం లేకుండా తన సపరేట్ ట్రాక్ లో తను బిజీగా ఉంది. ఇక ఈ మధ్య ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి లాంటి హీరోయిన్స్ పూజా రేంజ్ ని అందుకోవడానికే ఇంకా చాలా టైమ్ పట్టేలా ఉంది. అందుకే ఇప్పుడు తిరుగు లేని హీరోయిన్ గా బుట్టబొమ్మ స్టార్ హీరోలకు ఫస్ట్ ఆప్షన్ గా మారింది.

Singer KK : సింగర్ KK మృతిపై పవన్ కళ్యాణ్, చిరంజీవి సంతాపం..

విజయ్ దేవరకొండ సరసన జనగణమనలో పూజానే హీరోయిన్. మహేశ్ – త్రివిక్రమ్ కాంబోలో రానున్న ప్రాజెక్టులోనూ పూజానే హీరోయిన్. ఇటీవలే F3లో వెంకటేశ్, వరుణ్ లతో కూడా కలిసి స్టెప్పులేసింది. ఇక పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ ప్రాజెక్టులోనూ పూజా హెగ్డేనే హీరోయిన్. కేవలం టాలీవుడ్ సినిమాలు మాత్రమే కాదు, వరుస బాలీవుడ్ సినిమాల్లో కూడా పూజా నటిస్తోంది. రణ్ వీర్ సింగ్ తో చేస్తోన్న సర్కస్ ఆల్ మోస్ట్ పూర్తయింది. ఇక సల్మాన్ ఖాన్ తో కభీ ఈద్ కభీ దివాళి వంటి ప్రాజెక్ట్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసింది. తాజాగా సందీప్ వంగ బాలీవుడ్ యానిమల్ సినిమాలో కూడా ఐటెం సాంగ్ కి ఒప్పుకున్నట్టు సమాచారం. ఇలా ఒకపక్క ఐటెం సాంగ్స్ తో, మరో పక్క అన్ని భాషల్లో వరుస సినిమాలతో పూజా టాప్ హీరోయిన్ గా వెలిగిపోతుంది.