Pooja Hegde : 2022 మొత్తం పూజా హెగ్డేదే..

టాలీవుడ్ లో పూజా హెగ్డే వరుస సినిమాలతో, వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఉన్న...

10TV Telugu News

Pooja Hegde :  ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా హెగ్డే వరుస సినిమాలతో, వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో అందరి కంటే బిజీగా ఉన్నది పూజానే. పూజా చేతిలో దాదాపు 8 సినిమాలు ఉన్నాయి. ఈ 2022లో పూజా హెగ్డే సినిమాలు వరుసగా రిలీజ్ కి ఉన్నాయి. కొన్ని షూటింగ్స్ ని మొదలు పెట్టనున్నాయి. ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ పెద్దవే. ఆ లిస్ట్ చూస్తే కచ్చితంగా 2022 మొత్తం పూజా నామ సంవత్సరమే అనొచ్చు.

Chiranjeevi : కృష్ణా జిల్లా డోకిపర్రులో చిరంజీవి.. భార్యతో కలిసి గోదాదేవి కళ్యాణం..

ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వాలి కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. 2022 సమ్మర్ లో ‘రాధేశ్యామ్’ రానుందని సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ ల మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నటిస్తుంది పూజా హెగ్డే. ఈ సినిమాని ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు కానీ కరోనా పరిస్థితిని బట్టి ఇది కూడా వాయిదా పడే అవకాశం ఉంది.

తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం ‘బీస్ట్’ సినిమా చేస్తున్నారు. ‘బీస్ట్’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని సమ్మర్ కి విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు.

బాలీవుడ్ మాస్ సినిమాలు తీసే డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో ‘సర్కస్’ అనే కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కుతుంది. ఇందులో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని జులైలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

సల్మాన్ ఖాన్ హీరోగా ‘భాయ్ జాన్’ సినిమా త్వరలో షూటింగ్ మొదలు కాబోతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘భాయ్ జాన్’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేయబోతుంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమాలో కూడా పూజా హెగ్డేనే హీరోయిన్ గా చేయబోతుంది. ఈ సినిమా షూటింగ్ సమ్మర్ నుంచి మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం.

Pawan Kalyan : హరిహర వీరమల్లు.. రెండు విభిన్న పాత్రల్లో పవర్ స్టార్

ఇవి కాకుండా పూజా మరో రెండు సినిమాలకి కూడా సైన్ చేసినట్టు తెలుస్తుంది. వరుస హిట్స్ పడటంతో రెమ్యునరేషన్ కూడా పెంచేసింది. ప్రస్తుతం సినిమాకి మూడు కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇలా వరుస సినిమాలతో పూజా అన్నీ సినీ పరిశ్రమలలోనూ బిజీగా ఉంది.

×