Pooja Hegde: మందు ఎలా కలపాలో చూపించి .. ఆల్కహాల్‌తో స్టెప్పులేసిన పూజా హెగ్డే..

ఎప్పటిలాగే తన కాళ్ళు కనిపించేలా పొట్టి బట్టలు వేసుకొని జానీ వాక‌ర్ రెడ్ లేబుల్ బ్రాండ్ విస్కీని ఓ గ్లాసులో పోసి, అందులో ఐస్ క్యూబ్స్ వేసి క‌లిపింది. ఆ విస్కీ గ్లాస్ ని చూపించి.....

Pooja Hegde: మందు ఎలా కలపాలో చూపించి .. ఆల్కహాల్‌తో స్టెప్పులేసిన పూజా హెగ్డే..

Pooja

Pooja Hegde:  ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధిస్తూ చేతిలో అరడజను సినిమాలతో బిజీ బిజీగా ఉంది పూజా హెగ్డే. తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇక ఇటీవల మాల్దీవ్స్ వెళ్లి హాట్ హాట్ బికినీ ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ఈ ఫోటోలు చూసి పూజ పాపా ఈ రేంజ్ లో హడావిడి చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. వెకేషన్ పూర్తి చేసుకొని తిరిగి వచ్చి మళ్ళీ షూటింగ్స్ తో బిజీ అయిపొయింది. తాజాగా పూజ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతుంది.

Surekha Vani : సురేఖ వాణి ఫొటోస్

#RevibeTheNight ఫేమ‌స్ సాంగ్ తో చేసిన స్టెప్పులను వేసి అదరగొట్టింది ఈ బుట్టబొమ్మ. ఎప్పటిలాగే తన కాళ్ళు కనిపించేలా పొట్టి బట్టలు వేసుకొని జానీ వాక‌ర్ రెడ్ లేబుల్ బ్రాండ్ విస్కీని ఓ గ్లాసులో పోసి, అందులో ఐస్ క్యూబ్స్ వేసి క‌లిపింది. ఆ విస్కీ గ్లాస్ ని చూపించి స్టైలిష్ గా స్టెప్పులు వేస్తూ అద‌రగొట్టింది. #RevibeTheNight హ్యాష్ ట్యాగ్‌తో ఈ వీడియోని షేర్ చేసింది పూజ పాప. అయితే ఇది ప్రమోషన్ వీడియో అని తెలుస్తుంది. కొంతమంది నెటిజన్లు ఇలా డబ్బుల కోసం ఆల్కహాల్ ని ప్రమోట్ చేయడంపై విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా గత కొద్ది రోజులుగా పూజా హెగ్డే సోషల్ మీడియాలో తన ఫోటోలు, వీడియోలతో హల్ చల్ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)