Pooja Hegde : పూజా హెగ్డే ఫేవరేట్ ఫుడ్.. ఫేవరేట్ డ్రెస్.. ఇవేనా??

అఖిల్ తో నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో వచ్చి సక్సెస్ ని అందుకుంది. ఇవాళ వైజాగ్ లో ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా జరగబోతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్ తో

Pooja Hegde : పూజా హెగ్డే ఫేవరేట్ ఫుడ్.. ఫేవరేట్ డ్రెస్.. ఇవేనా??

Pooja

Pooja Hegde :  ప్రస్తుతం టాలీవుడ్ లో పూజ హెగ్డే హవా నడుస్తుంది. ఓ పక్క వరుస సినిమాలతో హిట్లు కొడుతూ మరో పక్క స్టార్ హీరోల సరసన సినిమాలు చేయడానికి రెడీ అయిపోతుంది. తన అందంతో అభిమానులని కూడా బాగానే సంపాదించుకుంటుంది. తాజాగా అఖిల్ తో నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో వచ్చి సక్సెస్ ని అందుకుంది. ఇవాళ వైజాగ్ లో ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా జరగబోతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్ తో రిలీజ్ అయ్యాక సక్సెస్ తో ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకిష్టమైన వాటి గురించి చెప్పింది.

తనకిష్టమైన డ్రెస్ ల గురించి మాట్లాడుతూ.. నాకు చీరలంటే ప్రత్యేకమైన గౌరవం. నా దృష్టిలో ఎవరికైనా సరే చీరలు బాగుంటాయి. ఇటీవల నా పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ టీమ్‌ లంగావోణీలో ఉన్న నా పోస్టర్‌ను విడుదల చేశారు. ‘గద్దలకొండ గణేష్‌’లో శ్రీదేవి క్యారెక్టర్‌కి లంగావోణీలే వేసుకున్నాను. ఇప్పుడు ‘ఆచార్య’లో నీలాంబరిగా కూడా లంగావోణీలే వేస్తున్నాను. పర్సనల్‌గా ఇంట్లో లంగావోణీలు వేసుకోవడం నాకు అలవాటే. వాటిల్లో నేను చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతాను అని చెప్పింది.

Bigg Boss 5 : డ్యాన్సులతో అదరగొట్టిన కంటెస్టెంట్స్.. కూల్ అయిన నాగార్జున

ఇక తన ఫేవరేట్ ఫుడ్ గురించి మాట్లాడుతూ… నాకు ఎక్కువగా నాన్‌వెజ్‌ అంటే చాలా ఇష్టం. మా అమ్మ చేసే ‘మంగళూరియన్‌ రొట్టి’ నాకు ఫేవరెట్‌. అడిగినప్పుడల్లా మా అమ్మ చేసి పెడుతుంది. నేను కూడా బాగా తింటాను అని చెప్పింది. అంతే కాక లాక్‌డౌన్‌లో వంటకాలపై ఎన్నో ప్రయోగాలు చేశాను. ఇంట్లో వాళ్ళు నన్ను మాస్టర్‌ షెఫ్‌ అని పిలుస్తున్నారు అంటూ సరదాగా తెలిపింది.

Chiranjeevi : మెగా అభిమానులతో చిరంజీవి సమావేశం

ఇక చిన్నప్పట్నించి మాధురీ దీక్షిత్‌ అంటే చాలా ఇష్టమని, ఆమె డ్యాన్స్‌కి పెద్ద ఫ్యాన్‌ అని, ఆమెలా ఆల్‌రౌండ్‌ పెర్ఫార్మర్‌ అనిపించుకోవాలని ఉందని తెలిపింది. హీరోల్లో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌ లు అంటే చాలా ఇష్టం అని, ఇప్పుడు ‘ఆచార్య’లో చిరంజీవి గారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది అని తెలిపింది.