Pooja Hegde : పాపం పూజా.. త్రివిక్రమ్ అయినా ఆదుకుంటాడా?

తాజాగా పూజాహెగ్డే సల్మాన్ ఖాన్ సరసన నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమా రిలీజయింది. స్టార్ హీరో కావడంతో ఓపెనింగ్స్ వస్తున్నా సినిమా మాత్రం హిట్ టాక్ తెచ్చుకోలేదు.

Pooja Hegde : పాపం పూజా.. త్రివిక్రమ్ అయినా ఆదుకుంటాడా?

Pooja Hegde gets 5 flops in row hopes on Trivikram movie

Pooja Hegde :  కన్నడ(Kannada) భామ పూజా హెగ్డే(Pooja Hegde) ప్రస్తుతం తెలుగు(Telugu), తమిళ్(Tamil), హిందీ(Hindi) భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. సినిమా ఆఫర్స్ అయితే వస్తున్నాయి కానీ హిట్ మాత్రం రావట్లేదు. 2021 వరకు వరుసగా విజయాలు అందుకున్న పూజాహెగ్డే 2022 నుంచి మాత్రం ఒక్కసారిగా టర్న్ అయి పరాజయాలు అందుకుంటుంది. 2022లో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన నాలుగు సినిమాలు రిలీజయ్యాయి.

ప్రభాస్ తో నటించిన రాధేశ్యామ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత వచ్చిన బీస్ట్ సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చినా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అనంతరం వచ్చిన ఆచార్య సినిమా అయితే పూర్తిగా డిజాస్టర్ అయింది. ఇక బాలీవుడ్ లో సర్కస్ సినిమాతో వచ్చినా ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీంతో 2022 పూజాకు కలిసి రాలేదు. 2023లో అయినా పూజా ఫేట్ మారుతుంది అనుకుంది.

కానీ తాజాగా పూజాహెగ్డే సల్మాన్ ఖాన్ సరసన నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా రిలీజయింది. స్టార్ హీరో కావడంతో ఓపెనింగ్స్ వస్తున్నా సినిమా మాత్రం హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఇక సినిమాలో సల్మాన్ ఖాన్ పక్కన పూజాహెగ్డే చిన్న పిల్లలా ఉందని కూడా కామెంట్స్ వస్తున్నాయి. దీంతో ఈ సినిమా కూడా పూజాకి నిరాశే మిగిల్చింది. ప్రస్తుతం పూజా చేతిలో ఉన్న సినిమాల్లో మహేష్ – త్రివిక్రమ్ సినిమా SSMB28 ఒకటి. ఈ సినిమాని వచ్చే సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.

Agent Movie : పోకిరి, బాహుబలి 2.. ఇప్పుడు అఖిల్ ఏజెంట్.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవ్వుద్దా?

గతంలో త్రివిక్రమ్ పూజాకు అరవింద సమేత వీరరాఘవ, అలవైకుంఠపురంలో సినిమాలతో హిట్స్ ఇచ్చాడు. మరి ఇప్పుడు మహేష్ సినిమాతో కూడా హిట్ యిచ్చి పూజా కెరీర్ ని మళ్ళీ గాడిలో పెడతాడేమో చూడాలి. అయితే పూజాకు సక్సెస్ లు రాకపోయినా సినిమా ఆఫర్స్ రావడం మాత్రం విశేషం.